News
News
X

North Korea Missile Test: ఆ దేశాల అండతో రెచ్చిపోతున్న కిమ్- మరో 2 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం!

North Korea Missile Test: ఉత్తర కొరియా మరో రెండు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది.

FOLLOW US: 
 
North Korea Missile Test: ఉత్త‌ర కొరియా కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా గురువారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశం పరీక్షించింది. 

ఆరోసారి

గత 10 రోజుల్లో ఆరోసారి బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను ప్రయోగించింది ఉత్తర కొరియా. అమెరికా, ద‌క్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయ‌ని దానికి కౌంట‌ర్‌గా క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు ఉత్త‌ర కొరియా తెలిపింది.

అమెరికా సీరియస్

News Reels

అయితే వరుసగా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. రష్యా, చైనా దేశాలు ఉత్త‌ర కొరియాకు అండ‌గా నిలుస్తున్నాయ‌ని అమెరికా పరోక్ష వ్యాఖ్యలు చేసింది. 

" ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రెండు దేశాలు.. ఉత్తర కొరియాకు రక్షణ కవచంలా పని చేస్తున్నాయి. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలను ఖండిస్తూ ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాలని ఐరాస ప్రయత్నిస్తోంది. కానీ ఆ రెండు దేశాలు మాత్రం ఉత్తర కొరియాను ఆంక్షల నుంచి రక్షించే యత్నం చేస్తున్నాయి. ఆ రెండు దేశాల సంరక్షణలోనే ఉత్తర కొరియా ఉంది. వాళ్లను చూసే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రెచ్చిపోతున్నాడు. "
-                                                                 అమెరికా

జపాన్ మీదుగా

ఉత్తర కొరియా.. తూర్పు వైపున జపాన్‌ గగనతలం మీదుగా గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని ఇటీవల పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ కూడా ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ప్రజలకు సూచించింది.

ఆగ్రహం 

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్‌ ప్రధాని కిషిదా ఆగ్రహం వ్యక్తం చేశారు. అణ్వాయుధాలు కలిగిన దేశాలను రెచ్చగొట్టాలని ఉత్తర కొరియా ప్రయత్నిస్తోందని కిషిదా అన్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇటీవల ఉత్తర కొరియా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని సముద్రం వైపు ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్‌ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో పడిందని పేర్కొంది. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా సైన్యం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

కొత్త చట్టం

ప్రపంచంపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త బాంబు పేల్చారు. అణ్వాయుధాల వినియోగంపై ఓ కొత్త చట్టం తీసుకువచ్చారు. త‌న‌ను తాను ర‌క్షించుకునే సమయంలో ముంద‌స్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ చ‌ట్టాన్ని త‌యారు చేసింది. అణ్వాయుధీక‌ర‌ణ అంశంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

అణ్వాయుధాల వినియోగంపై వెనక్కి తగ్గేదే లేదు. మా దేశాన్ని రక్షించుకునే విషయంలో అవసరమైతే ముందుగా మేమే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.                               "

-కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత

దేశానికి న్యూక్లియ‌ర్ స్టేట‌స్ ఇస్తూ నార్త్ కొరియా పార్ల‌మెంట్ ఈ కొత్త చ‌ట్టాన్ని రూపొందించింది. అటామిక్ ఆయుధాల‌ను ఆటోమెటిక్‌గా వాడుకునే అవ‌కాశాన్ని మిలిట‌రీకి క‌ల్పిస్తున్న‌ట్లు కొత్త చ‌ట్టంలో పేర్కొన్నారు.

Also Read: Amit Shah in Baramulla Rally: మసీదు నుంచి 'ఆజాన్' పిలుపు- అమిత్ షా ఏం చేశారంటే?

Published at : 06 Oct 2022 01:16 PM (IST) Tags: US North Korea Missile Test North Korea fires two ballistic missiles provoking the spate of missile launches

సంబంధిత కథనాలు

Chandrababu : పాదయాత్రలో ముద్దులు ఇప్పుడు పిడిగుద్దులు, జగన్ సభల్లో చప్పట్లు కొట్టకపోతే పథకాలు కట్ - చంద్రబాబు

Chandrababu : పాదయాత్రలో ముద్దులు ఇప్పుడు పిడిగుద్దులు, జగన్ సభల్లో చప్పట్లు కొట్టకపోతే పథకాలు కట్ - చంద్రబాబు

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో అప్‌డేట్- ఆ కత్తిని కనిపెట్టిన పోలీసులు!

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో అప్‌డేట్- ఆ కత్తిని కనిపెట్టిన పోలీసులు!

UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి

UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

AIIMS Server Hack: ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌ను సులువుగా తీసుకోలేం, దీని వెనకాల కుట్ర ఉండొచ్చు - కేంద్ర ఐటీ మంత్రి

AIIMS Server Hack: ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌ను సులువుగా తీసుకోలేం, దీని వెనకాల కుట్ర ఉండొచ్చు - కేంద్ర ఐటీ మంత్రి

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !