By: ABP Desam | Updated at : 04 Oct 2022 04:26 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Twitter)
Nobel Prize 2022 in Physics: 2022 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్ బహుమతి వచ్చింది. భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్‌లకు ఈ పురస్కారం దక్కింది. స్టాక్‌హోంలోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది.
Nobel Prize in Physics jointly won by Alain Aspect, John F. Clauser and Anton Zeilinger “for experiments with entangled photons, establishing the violation of Bell inequalities and pioneering quantum information science.” pic.twitter.com/fGh2ImBqX4
— ANI (@ANI) October 4, 2022
వైద్య రంగంలో
వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. మానవ పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సెక్రెటరీ థామస్ పెర్ల్మన్.. నోబెల్ విజేత పేరును ప్రకటించారు.
మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
బుధవారం రసాయన, గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ విజేత పేరును వెల్లడిస్తారు.
డిసెంబర్‌లో
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.
Also Read: Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!
Also Read: Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- చిక్కుకుపోయిన 21 మంది!
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల, Feb 22 నుండి 28 వరకు - ఇలా బుక్ చేస్కోండి
Stocks to watch 08 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఆకాశమే హద్దుగా చెలరేగిన Airtel
Tirumala News: ప్రతి బుధవారం శ్రీ వేంకటేశ్వరుడికి ఏ నైవేద్యం సమర్పిస్తారంటే?
Weather Latest Update: నేడు 14 జిల్లాల్లో అధికంగా చలి! ఇకపై క్రమంగా ముదరనున్న ఎండలు
ABP Desam Top 10, 8 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
MLC Kavitha: ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత - 2024 ఎన్నికల చర్చకు హాజరు!
‘వసుమతి’కి పెళ్లైపోయింది - బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఘనంగా కియారా వెడ్డింగ్, ఒక్కరోజుకు అంత ఖర్చా?
Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !
Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!