Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- 10 మంది మృతి!
Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడి పర్వతారోహులు కొంతమంది చిక్కుకుపోయారు. 10 మంది మృతి చెందారు.
Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లోని ద్రౌపది దండ-2 పర్వత శిఖరంలో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. మంచు చరియలు విరిగిపడటంతో 29 మంది పర్వతారోహులు అక్కడ చిక్కుకుపోయారు. ఇందులో 10 మంది మృతి చెందారు. 8 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
రెస్క్యూ ఆపరేషన్
నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 29 మంది ట్రైనీలు హిమపాతానికి పర్వతంపై చిక్కుకుపోయినట్లు తొలుత సమాచారం వచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా ఈ మేరకు ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సైన్యాన్ని కోరారు.
UPDATE | Eight mountaineering trainees rescued, efforts underway to rescue the remaining (estimated) 21 more people stuck in the Uttarkashi avalanche: District Disaster Management Centre of Uttarkashi https://t.co/IctiB5aPrc pic.twitter.com/rjlKlFnoDT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 4, 2022