News
News
X

Yasir Lohar Arrested: జమ్ముకశ్మీర్ డీజీ హత్య కేసు నిందితుడు అరెస్ట్- దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

Yasir Lohar Arrested: జమ్ముకశ్మీర్ జైళ్ల డీజీ హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

FOLLOW US: 
 
Yasir Lohar Arrested: జమ్ముకశ్మీర్ డీజీపీ (జైళ్ల విభాగం) హేమంత్ కుమార్ లోహియా సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తోన్న డీజీపీ ఇంటి సహాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

" రాత్రంతా జమ్ముకశ్మీర్ పోలీసులు నిందితుడి కోసం గాలించారు. చివరికి డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య కేసులో కీలక నిందితుడు యాసిర్ లోహర్‌ను పట్టుకున్నాం. విచారణ మొదలైంది.                                                       "
-ముఖేశ్ సింగ్, ఏడీజీపీ 

ఇదీ జరిగింది

News Reels

1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్, జమ్ముకశ్మీర్‌ డీజీపీ (జైళ్ల విభాగం) హేమంత్ కుమార్ లోహియాను దారుణంగా హత్య చేశారు. తన ఇంటి సహాయకుడి చేతిలోనే ఆయన హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి యాసిర్ లోహర్.. ఆయన గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు.

ఇలా హత్య

డీజీ లోహియా తన ఇంటికి మరమ్మతులు చేయిస్తుండటంతో జమ్ము శివారులోని తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారు. ఆయన గొంతు కోసిన ఆనవాళ్లతో పాటు, ఒంటిపై కాలిన గాయాలున్నాయి. తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఇంటి సహాయకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కెచప్‌ బాటిల్ పగులకొట్టి గొంతుకోసి, తర్వాత ఆ మృతదేహాన్ని మంటల్లో కాల్చేయాలని ప్రయత్నించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంటలు రావడం గుర్తించి భద్రతా సిబ్బంది ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే గది లోపలి నుంచి గడియపెట్టి ఉన్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

మేమే చేశాం

అయితే ఈ హత్యకు తామే బాధ్యులమంటూ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్(పీఏఎఫ్ఎఫ్‌) అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. పటిష్ట భద్రత మధ్య కశ్మీర్ పర్యటనకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇది మా గిఫ్ట్ అంటూ పీఏఎఫ్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

షా పర్యటన

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తారు. ఇలాంటి సందర్భంలో డీజీ హత్యకు గురికావడంతో కలకలం రేగింది. దీంతో ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.

Also Read: Ballistic Missile Over Japan: దూకుడు పెంచిన కిమ్- జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం!

Also Read: Cocaine Seized In Mumbai: లోదుస్తుల్లో దాచి కొకైన్ అక్రమ రవాణా- ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న అధికారులు!

Published at : 04 Oct 2022 12:55 PM (IST) Tags: jammu kashmir Police DG Prisoner HK Lohia Murder Case Main Accused Yasir Lohar Arrested Yasir Lohar Arrested

సంబంధిత కథనాలు

Chandrababu : పాదయాత్రలో ముద్దులు ఇప్పుడు పిడిగుద్దులు, జగన్ సభల్లో చప్పట్లు కొట్టకపోతే పథకాలు కట్ - చంద్రబాబు

Chandrababu : పాదయాత్రలో ముద్దులు ఇప్పుడు పిడిగుద్దులు, జగన్ సభల్లో చప్పట్లు కొట్టకపోతే పథకాలు కట్ - చంద్రబాబు

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో అప్‌డేట్- ఆ కత్తిని కనిపెట్టిన పోలీసులు!

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో అప్‌డేట్- ఆ కత్తిని కనిపెట్టిన పోలీసులు!

UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి

UP News: ట్రైన్ విండోసీట్‌లో కూర్చున్న వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఐరన్ రాడ్, మెడకు గుచ్చుకుని మృతి

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

AIIMS Server Hack: ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌ను సులువుగా తీసుకోలేం, దీని వెనకాల కుట్ర ఉండొచ్చు - కేంద్ర ఐటీ మంత్రి

AIIMS Server Hack: ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌ను సులువుగా తీసుకోలేం, దీని వెనకాల కుట్ర ఉండొచ్చు - కేంద్ర ఐటీ మంత్రి

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Manchu Lakshmi Vs Ysrcp : జగన్‌ను ట్రోల్ చేసిన మంచు లక్ష్మి - ఇక వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ ఊరుకుంటారా?

Manchu Lakshmi Vs Ysrcp :  జగన్‌ను ట్రోల్ చేసిన మంచు లక్ష్మి - ఇక వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ ఊరుకుంటారా?