News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

India-Canada Row: భారత్‌కు మినహాయింపు లేదు-కెనడాతో వివాదంపై బైడెన్‌ అడ్వైజర్‌

India-Canada Row: భారత్‌కు మినహాయింపు లేదు.. కెనడాతో వివాదంపై బైడెన్‌ అడ్వైజర్‌

FOLLOW US: 
Share:

భారత్‌, కెనడాల మధ్య ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న్ నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాక్‌ సలీవాన్‌ గురువారం దీనిపై స్పందించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కెనడాలో ఖలిస్థాన్‌ ఉగ్రవాది హత్య కేసులో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని కెనడా చేస్తున్న ఆరోపణలపై ఉన్నతస్థాయిలో భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో భారత్‌కు ఎలాంటి మినహాయింపు లేదని ఆయన వెల్లడించారు. 

ఈ ఘటనపై అమెరికా ఆందోళన చెందడం ప్రక్రియకు ఏమైనా అంతరాయం కలిగిస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా.. అమెరికా తన ప్రిన్సిపుల్స్‌ కోసం నిలబడుతుందని, ఏ దేశం ప్రభావితమైనా సరే తమ విధానాల ఆధారంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఈ అంశం తమకు ఆందోళన కలిగించే విషయమని, దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని జాక్‌ సలీవాన్‌ పేర్కొన్నారు. దీనిపై తాము పనిచేస్తునే ఉంటామని, ఏ దేశంతో సంబంధం లేకుండా తాము పనిచేస్తామని అన్నారు. ఇలాంటి విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేవని, తాము తమ దేశ ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటామని తెలిపారు. కెనడా వంటి మిత్ర దేశాలు వారి చట్ట అమలు, దౌత్య ప్రక్రియను కొనసాగిస్తున్నప్పడు మేము కూడా వారితో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. మేము కెనడా అధికారులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అలాగే భారత్‌తో కూడా టచ్‌లో ఉన్నామని ఆయన తెలిపారు. అయితే ఈ అంశంపై కెనడా, అమెరికాల మధ్య దూరం ఉందని సూచించే నివేదికలతో తాను విభేదిస్తున్నట్లు వెల్లడించారు. కెనడా అధికారులు దర్యాప్తును కొనసాగించి, నేరస్థులను అదుపులోకి తీసుకోవాలని తాము కోరుకుంటున్నట్లు సలీవన్‌ వెల్లడించారు.

ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ భారత్‌పై ఆరోపణలకు తమ వద్ద నమ్మకమైన ఆధారాలున్నాయని మరోసారి వెల్లడించారు. కెనడాలో కెనడా పౌరుడి హత్యపై భారత్‌ పాత్ర ఉందని తమకు సహకరించాలని కోరారు. తాను రెచ్చగొట్టేందుకు మాట్లాడడం లేదని దర్యాప్తుకు సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ట్రూడో ఐరాసలోని కెనడా దౌత్య బృందంతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సిం్‌ నిజ్జర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తితలు మరింత పెరిగాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ పేర్కొన్నారు.  ఖలిస్థాన్ వేర్పాటు వాదులు కెనడా నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని భారత్ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల  నేపథ్యంలోనే కెనడాలోని భారత రాయబారిపై వేటు వేశారు. కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్‌ కూడా కెనడా రాయబారిని బహిష్కరించి  దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.  కెనడా  పౌరులకు వీసాల జారీలను కూడా భారత ప‌్రభుత్వం నిలిపేసింది.  జూన్‌ 18న కెనడాలోని బ్రాంప్టన్‌ పట్టణంలోని గురుద్వారా సాహిబ్‌ పార్కింగ్‌లో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన.  

Published at : 22 Sep 2023 01:21 PM (IST) Tags: PM Modi Biden Canada INDIA India-Canada Row America Reaction

ఇవి కూడా చూడండి

I.N.D.I.A Alliance Meeting: త్వరలోనే I.N.D.I.A కూటమి భేటీ, సీట్‌ షేరింగ్‌పై క్లారిటీ కోసమే!

I.N.D.I.A Alliance Meeting: త్వరలోనే I.N.D.I.A కూటమి భేటీ, సీట్‌ షేరింగ్‌పై క్లారిటీ కోసమే!

American Telugu Association: తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఆధ్వర్యంలో 20 రోజులు సేవా కార్యక్రమాలు

American Telugu Association: తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఆధ్వర్యంలో 20 రోజులు సేవా కార్యక్రమాలు

Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి

Top Headlines Today: టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందన్న బుద్ధా వెంకన్న! ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్

Top Headlines Today: టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందన్న బుద్ధా వెంకన్న! ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్

ABP Desam Top 10, 10 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 10 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!