అన్వేషించండి

Nitish Kumar:నితీష్ కుమార్ ఆన్ ఫైర్, అసెంబ్లీలో బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం

Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో బీజేపీ నేతలపై విరుచుకు పడ్డారు.

Nitish Kumar Angry in Assembly:

వేలు చూపిస్తూ...అరుస్తూ..

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయారు. మొత్తం సభలోని సభ్యులందరినీ తన వైపు తిప్పుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. "ఒకప్పటి నితీష్‌ను మళ్లీ చూశాం" అంటున్నారు కొందరు నేతలు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇటీవలే బిహార్‌లోని ఛప్రాలో కల్తీ లిక్కర్ తాగి 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై బీజేపీ సభలో పదేపదే వాదనకు దిగింది. ఇదే కంటిన్యూ అవుతుండటం వల్ల నితీష్ కుమార్ సహనం కోల్పోయారు. ఉన్నట్టుండి సీట్‌లో నుంచి లేచి మైక్ అందుకుని గట్టిగా మాట్లాడారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కళ్లురుముతూ బీజేపీ నేతలకు వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు "అరవకండి" అంటూ నినదించినా...నితీష్ కుమార్ అస్సలు ఆగలేదు. "మద్య నిషేధం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంతా మద్దతిచ్చారు కదా. అందుకు మీరే సాక్ష్యం కదా. మరి ఇప్పుడు ఇలా రివర్స్‌లో మాట్లాడటమేంటి..? అప్పుడు అంగీకరించిన వాళ్లంతా ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారు. ఇంకా లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయని ఎలా ఆరోపిస్తున్నారు..? చెత్త రాజకీయాలు చేయకండి. ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోండి" అని విరుచుకుపడ్డారు. దీనిపై..బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ డిప్యుటీ సీఎం, బీజేపీ నేత తారాకిషోర్ ప్రసాద్ స్పందించారు. "మద్య నిషేధానికి మేం సపోర్ట్ చేశాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మేం ఆ బిల్లుకి మద్దతునిచ్చాం. కానీ...ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది" అని విమర్శించారు. 

మద్యపాన నిషేధం..

బిహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. అయితే దీన్ని కఠినతరం చేసేందుకు బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022కు సవరణలు చేశారు. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా, జరిమానా డిపాజిట్‌ చేసి బెయిల్‌ పొందే అవకాశం కల్పించారు. అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగుతుండగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పూర్తి స్థాయి మద్యపాన నిషేధం అమలు చేస్తామని నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. అందుకు తగినట్లుగానే కఠిన చర్యలు చేపట్టారు. అయితే మద్యపాన నిషేధం వల్ల చాలా మంది కల్తీ సారాకు అలవాటైపోయి.. చనిపోతున్నారు. దీంతో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. కానీ నితీశ్ మాత్రం మద్యపాన నిషేధంపై మరింత కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.

Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 'జోడో యాత్ర'లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Dina Sanichar Story In Telugu: జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన
జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన "మోగ్లీ" నిజ జీవితంలో ఉన్నాడని తెలుసా?
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
Embed widget