NGT : తెలంగాణకు భారీ జరిమానా గండం ... ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకింగా ఎన్జీటీకి నివేదిక !
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఎన్జీటీ కమిటీ తేల్చింది. రూ.3 కోట్ల 70 లక్షల జరిమానా వేయాలని సిఫార్సు చేసింది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ఉల్లంఘనలకు పాల్పడిందని నిర్ధారించింది. అనుమతులు లేకపోయినప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి కాంపోనెంట్ సహా సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణం కొనసాగుతోందని జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన సంయుక్త కమిటీ నిర్ధారించింది తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3 కోట్ల 70 లక్షల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని సిఫారసు చేసింది.
Also Read : తెలుగు అకాడమీ ఉద్యోగులా ? బ‌్యాంక్ స్టాఫా ? కోట్లు కొట్టేసిందెవరు ?
పర్యావరణ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిజానిజాల నిర్ధారణకు ట్రైబ్యునల్ ఈ సంయుక్త కమిటీని గతంలో నియమించారు. గత నెలలో ప్రాజెక్టు కింద చేపడుతున్న నార్లాపూర్, ఏదుల, వెట్టెం, కరివెన, ఉద్దండపూర్ రిజర్వాయర్లను కమిటీ సందర్శించింది. తాగునీటి కాంపోనెంట్ సహా సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుతానికి తాగునీటి ప్రాజెక్టు అని, దానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సాగునీటి పనులు చేపట్టినప్పుడు అనుమతులు తీసుకుంటామని గతంలో మరో కేసులో ఎన్‌జీటీకి తెలిపింది.
Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి
ఒక్క పర్యావరణ అనుమతుల విషయంలోనే కాకుండా అసలు ఆ ప్రాజెక్టే అక్రమం అని ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుపై కర్ణాటకకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి. కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు, హోంశాఖకు కర్ణాటక ఫిర్యాదు చేసింది. ఎగువ రాష్ట్రానికి మిగులు జలాలు వాడుకునే హక్కు లేదని మిగులు జలాలపై ఆధారపడి పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టరాదని కర్ణాటక వాదిస్తోంది.
అయితే అన్ని అనుమతులతోనే నిర్మిస్తున్నామని తెలంగాణ చెబుతోంది. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతిస్తూ 2013 ఆగస్టు 8న జీవో నెంబర్ 72, డిండి ఎత్తిపోతలకు అనుమతిస్తూ 2007 జూలై 7న జీవో నెంబర్ 159ను అప్పటి ప్రభుత్వాలు జారీ చేశాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణంగా ప్రాజెక్టు పనులను చురుగ్గా నిర్వహిస్తారు.
Also Read : ఏపీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి... ఎన్జీటీని కోరిన తెలంగాణ...