By: ABP Desam | Updated at : 23 Jan 2022 05:07 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్స్ (ఫైల్ ఫొటో)
న్యూజిలాండ్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు విధించింది. కోవిడ్ కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంక్షల నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన విహహాన్ని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ పరిమితులను కఠినతరం చేయడంతో తన సొంత వివాహాన్ని రద్దు చేసుకోవలసి వచ్చిందని ఆమె తెలిపారు.
నా పెళ్లి వేడుక జరగదు అని జసిండా మీడియా సమావేశంలో ప్రకటించారు. మహమ్మారి ఫలితంగా అలాంటి అనుభవాన్ని పొందిన అనేక మంది న్యూజిలాండ్ వాసుల్లో తాను చేరానన్నారు. వివాహానికి హాజరయ్యేందుకు వివిధ నగరాల మధ్య ప్రయాణించడం వల్ల తన కుటుంబంలోని తొమ్మిది మందిక ఒమిక్రాన్ సోకిందని వెల్లడించారు. వారు ప్రయాణించిన ఒక విమానంలో ఫ్లైట్ అటెండెంట్‌కు ఇన్‌ఫెక్షన్ రావడంతో న్యూజిలాండ్ ఆదివారం అర్ధరాత్రి నుంచి "రెడ్ సెట్టింగ్" ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి ఏ దశలో ఉందో తెలుసా.. ఇన్సాకాగ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
ఓమిక్రాన్ మునుపటి డెల్టా వేరియంట్ కంటే చాలా ఎక్కువగా వ్యాపిస్తుందని ప్రధాని జసిండా అన్నారు. అయితే ఇది ప్రజలను తీవ్ర అనారోగ్యానికి గురిచేసే అవకాశం తక్కువని పేర్కొన్నారు. ప్రేక్షకుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, షాపుల్లో మాస్క్ లు తప్పనిసరి చేశామన్నారు. జసిండా ఆర్డెర్న్, క్లార్క్ గేఫోర్డ్ తమ వివాహ తేదీని ప్రకటించలేదు. కానీ రాబోయే కొద్ది వారాల్లో వివాహ తేదీని ప్రకటిస్తామని ప్రకటించారు.
కనీసం వచ్చే నెలాఖరు వరకు ఆంక్షలు అమల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జీవితమంటే అంతే ఇలాంటివి తప్పవు అని ప్రధాని జసిండా ఆర్డెర్న్ అన్నారు. 'మహమ్మారి వల్ల చాలా వినాశకరమైన ప్రభావాలను అనుభవించిన వేలాది మంది ఇతర న్యూజిలాండ్‌వాసులకు నేను భిన్నంగా లేను, అందులో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ప్రియమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారితో ఉండలేకపోవడం' అని జసిండా విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ న్యూజిలాండ్ లో 15,104 కోవిడ్ కేసులను వచ్చాయి. 52 మరణాలను నమోదు అయ్యాయి. న్యూజిలాండ్ లో గత రెండేళ్లుగా కఠినమైన సరిహద్దు పరిమితులు, స్నాప్ లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నాయి.
Also Read: జనవరి నుండి డిసెంబర్ వరకు... 2022 పబ్లిక్ హాలీడేస్ ను ఇలా లాంగ్ వీకెండ్ లా మార్చేసుకోండి
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్
Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !