Happy New Year 2023: నయా సాల్ జోష్‌లో ప్రపంచం, కొత్త ఏడాదికి న్యూజిలాండ్ వెల్‌కమ్
Happy New Year 2023: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త వేడుకల జోష్ మొదలైంది.
Happy New Year 2023:
న్యూ ఇయర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే అందరూ కొత్త ఏడాది మూడ్‌లోకి వెళ్లిపోయారు. సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. 2022కి గుడ్‌బై చెప్పి..2023కి వెల్‌కమ్ చెప్పేందుకు ఫుల్ జోష్‌తో ఎదురు చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ ఏడాది మొట్టమొదటగా కొత్త సంవత్సరం జరుపుకునేది ఎక్కడో తెలుసా..? పసిఫిక్ ద్వీపమైన Tongaలో. పసిఫిక్ ద్వీప దేశాలైన Tonga, Samoa, Kiribati అన్ని దేశాల కన్నా ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం చెప్పనున్నాయి. ఆ తరవాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా 2022కి వీడ్కోలు చెబుతాయి.
ఇక అందరి కన్నా ఆలస్యంగా వేడుకలు చేసునేది...Howland, Baker Islands.సిడ్నీ, సింగపూర్, లండన్, దుబాయ్‌లలోని కీలక ప్రాంతాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి. నెటిజన్లు ఇప్పటికే కొత్త ఏడాది స్వింగ్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో Bye Bye 2022 అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్నారు.
The world-famous ‘ball drop’ countdown for New Year’s Eve in New York is a day away and the numeral ‘2023’ has arrived and is ready in Times Square. pic.twitter.com/lpg0teufEI
— CBS Sunday Morning 🌞 (@CBSSunday) December 30, 2022
న్యూజిలాండ్‌లో కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పారు ప్రజలు. Sky Tower 10 సెకన్ల కౌంట్‌డౌన్ పెట్టి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పటం ఏటా జరిగేదే. ఈ సారి కూడా అదే తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ చేరుకుని కేరింతలు కొడుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Så er det nytår her i Auckland! pic.twitter.com/s5oUdZoY4w
— The US supports the peace process (@AliAdhamDK) December 31, 2022
#HappyNewYear #NZ #2023 #Auckland pic.twitter.com/sls8KGvr85
— Wisdom Iyekekpolo, PhD (@WIyekekpolo) December 31, 2022
యూకే ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని రిషి సునాక్. 2022లో కొవిడ్ కారణంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదుర్కొన్నామని అన్నారు. 2023లోనూ కొత్త సవాళ్లు ఎదురవుతాయని...కానీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడించారు. అంతర్జాతీయ వేదికపై బ్రిటన్ను ప్రత్యేకంగా నిలిపేందుకు ఈ కొత్త ఏడాది అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2023 will have its challenges, but the government I lead will always put your priorities first.
— Rishi Sunak (@RishiSunak) December 31, 2022
My New Year message 👇 pic.twitter.com/KatjfHHjty