Delhi Winter Action Plan: దిల్లీ పొల్యూషన్‌కి సొల్యూషన్ దొరికినట్టేనా, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
Delhi Air Pollution: దిల్లీలో చలికాలంలో కాలుష్యం తీవ్రం కాకుండా కేజ్రీవాల్ సర్కార్ ప్రత్యేక ప్లాన్ సిద్దం చేస్తోంది.
![Delhi Winter Action Plan: దిల్లీ పొల్యూషన్‌కి సొల్యూషన్ దొరికినట్టేనా, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? New Plan To Curb Severe Pollution In Delhi This Winter Check Details Here Delhi Winter Action Plan: దిల్లీ పొల్యూషన్‌కి సొల్యూషన్ దొరికినట్టేనా, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/b4cdec733c3ac4acc3988dd9257e842d1657795076_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Delhi Air Pollution:
ఈ ప్లాన్‌తో కాలుష్యాన్ని కట్టడి చేయండి..
దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం (Delhi Air Pollution) గురించి ప్రస్తావన వస్తే, దిల్లీ సిటీ పేరు తప్పకుండా వినిపిస్తుంది. అంతర్జాతీయంగా అత్యంత కలుషిత నగరాల జాబితాలో దిల్లీ ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా..ఇప్పుడిప్పుడే పరిష్కరించేందుకు రకరకాల మార్గాలు వెతుక్కుంటోంది ప్రభుత్వం. రానున్న చలికాలంలో దిల్లీ వాసులకు ఇబ్బందులు తప్పించేందుకు కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతోంది. ది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్-CAQM..గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- GRAP అమలు చేసేందుకు రెడీ అవుతోంది. కాలుష్యాన్ని కట్టడి చేయడమే కాకుండా, ప్రజలపై తీవ్ర ప్రభావం పడకుండా ఉండేందుకు ఈప్రణాళికలు తోడ్పడతాయని అంటోంది అక్కడి ప్రభుత్వం. 2017లోనే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ..ఈ గ్రేడెడె రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించింది. అక్టోబర్ మధ్య నుంచి ఎప్పుడైతే కాలుష్యం ఎక్కువవుతోందో అప్పుడు ఈ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ GRAPని నాలుగు భాగాలుగా విభజించారు.
తీవ్రతను బట్టి ఆంక్షలు..
వాయు నాణ్యత ఆధారంగా స్టేజ్‌లను నిర్ధరిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201-300 మధ్యలో ఉంటే స్టేజ్ 1గా, 301-400గా ఇంటే స్టేజ్2గా పరిగణిస్తారు. 401-450 వరకూ స్టేజ్-3 కాగా, 450 కి మించి AQI ఉంటే అత్యంత ప్రమాదకమైన స్టేజ్ 4గా నిర్ధరిస్తారు. బొగ్గుతో పాటు, రెస్టారెంట్‌లు,హోటల్‌లో తందూర్స్‌నూ వినియోగించేందుకు వీల్లేకుండా ఆంక్షలు విధిస్తారు. డీజిల్ జనరేటర్ సెట్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. స్టేజ్ 3 వరకూ తీవ్రత చేరుకుంటే, వెంటనే ఎన్‌సీఆర్, దిల్లీ పరిధిలోని నిర్మాణాలను ఆపేస్తారు. అత్యవసర ప్రాజెక్ట్‌లు తప్ప మిగతా అన్ని నిర్మాణాలపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ప్లంబింగ్, కార్పెంటరీ, ఇంటీరియర్ డెకరేషన్ లాంటివి మాత్రం చేసుకోవచ్చు. స్టోన్ క్రషర్స్, ఇటుక బట్టీలపైనా నిషేధం విధిస్తారు. అంతే కాదు. బీఎస్-3, బీఎస్-4 వాహనాలూ రోడ్డుపైకి రాకుండా ఆంక్షలు విధిస్తారు. ఇక స్టేజ్ 4లో ట్రక్స్, గూడ్స్ వాహనాలు తిరగకుండా నిషేధిస్తారు.
ఏటా దీపావళి తర్వాత దిల్లీ కాలుష్యమయం అయిపోతుంది. కాలుష్యంతో దిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్కోసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లను దాటిపోతూ ఉంటుంది. ఫలితంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని గతేడాది చీఫ్ జస్టిస్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఆందోళనల నేపథ్యంలోనే ఈ సారి కాస్త ముందుగానే ప్రణాళికలు వేసుకుని కాలుష్యాన్ని కట్టడి చేయాలని భావిస్తోంది దిల్లీ సర్కార్.
Also Read: The Warrior Movie Review - 'ది వారియర్' రివ్యూ: డాక్టర్ పోలీస్ అయితే? రామ్ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)