By: Ram Manohar | Updated at : 25 May 2023 05:35 PM (IST)
మే 28వ తేదీన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ఉదయం 7.30 గంటలకే మొదలు కానుంది.
New Parliament Inauguration:
అంతా రెడీ..
ఈ నెల మే 28వ తేదీన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయాలు జరుగుతున్నప్పటికీ...ఇదో చరిత్రాత్మక ఘట్టం అని మోదీ సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. పాత పార్లమెంట్‌లో కొన్ని లోపాలున్నాయని...వాటన్నింటినీ సవరిస్తూ కొత్త పార్లమెంట్ కట్టామని చెబుతోంది. ఈ వివాదాల సంగతి పక్కన పెడితే...ఆ రోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్రం ప్లాన్ చేసుకుంది. పక్కా షెడ్యూల్ ప్రకారమే ప్రతిదీ జరగనుంది.
పూర్తి షెడ్యూల్ ఇదే..
రాజకీయ రగడ..
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు ముదిరాయి. అన్ని పార్టీలనూ ఆహ్వానించామని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు విపక్షాలు ఆసక్తి చూపించడం లేదు. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొత్త పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతికి తగిన గౌరవం కల్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగ విలువల్ని కించపరిచారని ఆరోపించారు. లాయర్ జయసుకీన్ ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే 19 పార్టీలు తాము హాజరు కావడం లేదని లెటర్ రాశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మాత్రమే పార్లమెంట్‌ని ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశాయి. కానీ...బీజేపీ మాత్రం దీనిపై గట్టిగానే వాదిస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడుతోంది.
Also Read: Sengol in Parliament: పార్లమెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సెంగోల్, ఏంటీ దీని కథ - ఎందుకంత ప్రత్యేకం?
CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి
Coin Deposit: బ్యాంక్ అకౌంట్‌లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?
ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!
Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2023 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?