కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండండి, విదేశాంగ శాఖ సూచన
India Canada Tension: కెనడాలోని భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది.
India Canada Tension:
కెనడాలో ఉద్రిక్తతలు
కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిజ్జర్ హత్య విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉద్ధృతమవుతున్నాయి. ఇప్పటికే కెనడా రాయబారిపై భారత్ నిషేధం విధించింది. అటు కెనడా కూడా భారత రాయబారిని నిషేధించింది. రోజురోజుకీ వివాదం ముదురుతుండడం వల్ల భారత్ అప్రమత్తమైంది. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. భారత్‌కి వెళ్లే వాళ్లపై ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది కెనడా. ఇప్పుడు భారత విదేశాంగ శాఖ కెనడాలోని భారతీయుల కోసం అడ్వైజరీ జారీ చేసింది. రాజకీయ కక్షతో కొందరు హింసను ప్రేరేపిస్తున్నారని వెల్లడించింది. ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు స్పష్టం చేసింది. కెనడాలోని భారతీయ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. దాదాపు ఏడాదిగా అక్కడ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. పలు హిందూ ఆలయాలపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడులు చేస్తున్నారు.
"కెనడాలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ కక్షతో కొందరు హింసకు పాల్పడుతున్నారు. ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విద్యార్థులు ఒట్టావాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అవ్వండి. లేదంటే టొర్నటోలోని కాన్సులేట్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. అలా అయితేనే అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించగలం. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించండి"
- భారత విదేశాంగ శాఖ
India issues advisory for Indian nationals and students in Canada
— ANI (@ANI) September 20, 2023
"In view of growing anti-India activities and politically-condoned hate crimes and criminal violence in Canada, all Indian nationals there and those contemplating travel are urged to exercise utmost caution.… pic.twitter.com/G6cmhSuGfb
Indian World Forum కూడా ఈ వివాదంపై స్పందించింది. ఓ ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేసింది. కెనడాలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఉద్యమాలను తీవ్రంగా ఖండించింది. కెనడా ప్రభుత్వం ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించాలని తేల్చి చెప్పింది. భారత్‌పై విషం చిమ్ముతున్న ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది. భారతీయులపై హింసకు పాల్పడడం అంటే అది యూఎన్ ఛార్టర్ని ఉల్లంఘించినట్టే అవుతుందని హెచ్చరించింది. కెనడా ప్రధాని ఇప్పటికే ఈ వివాదంపై అమెరికా సాయం కోరారు. అమెరికా మాత్రం ఇంకా స్పందించలేదు.
Indian World Forum issues press statement, "Indian World Forum strongly condemns the disgruntled activities by unlawful organizations including Sikhs for Justice for stalking and purporting violence on the Indian diaspora in Canada...Indian World Forum urges the Government of… pic.twitter.com/H2wOjvSiyZ
— ANI (@ANI) September 20, 2023
Also Read: వెంటనే ఇండియాకి వెళ్లిపోండి, కెనడాలోని హిందువులకు ఖలిస్థాన్ వేర్పాటువాది వార్నింగ్