Amrita Fadnavis: మహారాష్ట్ర సీఎం సతీమణి డ్రెస్సింగ్‌పై మరోసారి దుమారం - బీజేపీకి క్లాస్ పీకుతున్న నెటిజన్లు
Maharashtra CM wife: మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఇటీవల బీచ్ ను శుబ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆమె ధరించిన డ్రెస్‌పై నెటిజన్లు ..బీజేపీ విధానానికి లింక్ పెట్టి విమర్శలు చేస్తున్నారు.

Maharashtra CM wife Amrita Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్. ఆమె కూడా పొలిటికల్ కామెంట్లతో అప్పుడప్పుడూ వైరల్ అవుతూంటారు. అదే సమయంలో ఫ్యాషన్ ఐకాన్ కూడా. అలాగే సామాజిక సేవాకార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. అయితే ఆమె పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ధరించే దుస్తులు కొన్ని సార్లు వైరల్ అవుతూంటాయి.
ఇటీవల బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో పాటు కొంత మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అక్కడ బీచ్ లో చెత్తను క్లీనింగ్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
#WATCH | Mumbai, Maharashtra: Amruta Fadnavis, wife of Maharashtra CM Devendra Fadnavis, along with actor Akshay Kumar and BMC Commissioner Bhushan Gagrani, participates in the Beach Cleanup Program- Post Ganpati Visarjan. pic.twitter.com/C7SmrYeeaG
— ANI (@ANI) September 7, 2025
ఈ కార్యక్రమానికి ఆమె ధరించిన ఔట్‌ఫిట్‌పై కొంత మంది నెటిజన్లు విమర్శలు ప్రారంభించారు. స్కిన్నీ జిమ్ వేర్ ఆమె ధరించారు. పబ్లిక్ ఈవెంట్స్ లో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నది ఆమె ఇష్టమని..కానీ ఇతరుల డ్రెస్సింగ్ ను బీజేపీ నేతలు, వాటి అనుబంధ సంఘాలు ఎందుకు ప్రశ్నిస్తాయని కొంత మంది ఈ వీడియోకు లింక్ పెట్టి ప్రశ్నలు సంధిస్తున్నారు.
Amruta Fadanvis is very Powerful.
— गजाभाऊ (@gajabhauX) September 8, 2025
त्या रोज सनातनी पुरुषी समाजावर थयथय नाचतात.
मंगळसूत्र घालत नाही. टिकली लावत नाहीत
त्यांना आवडेल असे कपडे घालतात
त्या वाईट/बरोबर काही असेल व्यक्त होतात
मुस्लिम इन्फ्लुएन्सर बरोबर विडिओ काढून सर्वधर्म समभाव प्रचार करतात
बँक मध्ये मोठया पदावर… pic.twitter.com/VPDGcq5iHo
కొంత మంది ఆమె ముఖ్యమంత్రి సతీమణి అని గుర్తు చేస్తున్నారు. గౌరవం పెెంచేలా ఉండాలని సలహాలు ఇస్తున్నారు.
This is the wife of the Chief Minister of Maharashtra (India). When she copied how to dress up for public events from the West, the code got corrupted before it got pasted. pic.twitter.com/x3GJ9mr1WY
— Jayant Bhandari (@JayantBhandari5) September 8, 2025
సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి విమర్శలను అమృతా ఫడ్నవీస్ పట్టించుకోరు. తాను ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటారు. ఎవరైనా రాజకీయ నేత విమర్శిస్తే మాత్రం గట్టి కౌంటర్ ఇస్తారు. ముఖ్యమంత్రి సతీమణిగా ఆమె చాలా కార్యక్రమాలకు హాజరవుతూంటారు. అయితే యోగాతోపాటు బీచ్ క్లీనింగ్ వంటి కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు.. వాటికి సరిపోయే దుస్తులనే వేసుకువస్తారు. ఇతర ఈవెంట్స్ కు.. ఆయా ఈవెంట్స్ తగ్గ దుస్తుల్లోనే వెళ్తారు. అందుేక అమృతా ఫడ్నవీస్‌కు మద్దతు కూడా ఎక్కువగానే వస్తోంది.





















