అన్వేషించండి

Aadhaar Update Process: ఆధార్‌ కార్డులో ఒకేసారి మొత్తం వివరాలు అప్‌డేట్ చేసుకోవాలా.. ఇలా చేస్తే టైం, డబ్బు ఆదా.

ఆధార్ కార్డులో కొందరి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు తప్పుగా ఉంటాయి. అయితే ఒక్కో విషయాన్ని అవసరం పడినప్పుడు కాకుండా ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఒకేసారి అన్ని వివరాలు అప్‌డే చేసుకోవచ్చు.

Aadhaar Details Update Process | ఆధార్ కార్డ్ ఈ రోజుల్లో మన గుర్తింపునకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అయింది. బ్యాంకు నుండి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిచోటా దీని అవసరం తప్పక ఉంది. కానీ తరచుగా, అందులోని కొన్ని వివరాలు తప్పుగా ఉండటమో లేక కొత్త వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది ప్రతి మార్పు కోసం పలుమార్లు మీసేవా కేంద్రాలకు వెళ్తుంటారు.  

ఆధార్ కార్డులో మార్పులు చేయించిన ప్రతిసారీ అందుకు ఫీజు కూడా చెల్లించాలి. అటువంటి సందర్భాలలో మీ సమయంతో పాటు డబ్బు ఖర్చవుతాయి. కానీ మీరు ఒకేసారి చాలా సమాచారాన్ని అప్‌డేట్ చేయాల్సి వస్తే అందుకు సులభమైన, చవకైన మార్గం ఉంది. దీని కోసం ఏం చేయాలి, ఎంత ఫీజు ఉంటుందో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

అన్ని విషయాలను ఒకేసారి ఎలా అప్‌డేట్ చేయాలి

 ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి UIDAI మనకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాలు కల్పించింది. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు పేరు లేదా చిరునామా వంటి ప్రాథమిక సమాచారాన్ని మార్చాలనుకుంటే ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. అప్‌డేట్ రిక్వెస్ట్ పెట్టాలి. అదే సమయంలో మీ పుట్టిన తేదీ, బయోమెట్రిక్ లేదా మీ ఫోటో లాంటి సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి మీరు కచ్చితంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. 

ఆధార్ సెంటర్లో మీరు అప్లికేషన్ ఫారమ్ తీసుకోవాలి. ఆధార్ కార్డులో మీరు ఏం అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో దానిపై టిక్ చేయాలి. మీరు ఒకేసారి మీకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని ఒకేసారి అప్‌డేట్ చేయవచ్చు. ఇందుకోసం మీరు పదే పదే ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేదు. 

మీ విలువైన సమయం, డబ్బు ఆదా 

ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి UIDAI కొంత ఫీజును నిర్ణయించింది. సాధారణంగా మీరు ప్రతి అప్‌డేట్‌ కోసం రూ. 50 ఫీజు చెల్లించాలి. కానీ మీరు ఒకేసారి చాలా సమాచారాన్ని అప్‌డేట్ చేస్తే, ఫీజు ఒకేసారి తీసుకుంటారు. అన్ని వివరాలు ఒకేసారి, ఒకేచోట అప్ డేట్ చేపించడం మీ డబ్బును ఆదా చేస్తుంది. పదే పదే ఆధార్ కార్డ్ కేంద్రాలకు వెళ్లకుండా మీ సమయాన్ని సేవ్ చేస్తుంది.. 

ఆధార్ సేవా కేంద్రంలో మీరు వాళ్లు అడిగే అవసరమైన సంబంధిత డాక్యుమెంట్‌లను తీసుకెళ్లాలి. అధికారులు అదే రోజున ప్రక్రియను పూర్తి చేయనున్నారు. చాలా మందికి ఇది తెలియక చిన్న చిన్న మార్పుల కోసం పదే పదే ఆన్ లైన్లో అప్డేట్ చేస్తుంటారు. లేక ఆధార్ సెంటర్స్‌కు వెళ్లి ఒక్కో విషయాన్ని అప్‌డేట్ చేపిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు ప్రభుత్వ ఆసుపత్రులలోనూ ఆధార్ కార్డులను పథకాలకు లింక్ చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉచిత బస్సు కోసం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తారు. కానీ అందులో వివరాలు సరిగ్గా లేవని కొన్ని సందర్భాలలో టికెట్లు సైతం ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Embed widget