By: Ram Manohar | Updated at : 24 May 2023 01:32 PM (IST)
పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. (Image Credits: Pixabay)
Netflix Password Sharing:
100 దేశాల్లో అదే ఫీచర్..
నెట్‌ఫ్లిక్స్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఇప్పటికే ఆంక్షలు విధించిన ఆ కంపెనీ మరోసారి ఆ పాలసీలో మార్పులు చేసింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లిస్ట్‌లో కొందరిని యాడ్ చేసుకోవచ్చని గతంలో చెప్పిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఆ ఫీచర్‌ని కూడా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కచ్చితంగా అందరూ డబ్బులు చెల్లించాలని తేల్చి చెప్పింది. రెవెన్యూని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. "నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ని ఒకరు మాత్రమే ఉపయోగించాలి" అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది 10కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లు పాస్‌వర్డ్ షేర్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఇది రెవెన్యూపై చాలా ప్రభావం చూపించిందని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ నెట్‌ఫ్లిక్స్ "borrower" లేదా "shared" అకౌంట్స్ ఫీచర్ తీసుకొచ్చింది. సబ్‌స్క్రైబర్‌లు కొంత ఎక్స్‌ట్రా డబ్బులు చెల్లించి అకౌంట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే..అకౌంట్స్‌ని ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ కొన్ని దేశాల్లోనే ఈ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు 100 దేశాలకు ఇదే పాలసీని విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. అయితే...ఎప్పుడూ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు పెట్టలేదు. అయితే..రానురాను ఇది రెవన్యూని దెబ్బ తీయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు "Shared" ఫీచర్‌ని దాదాపు 103 దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ లిస్ట్‌లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ ఉన్నాయి. అదనంగా నెలకు 8 డాలర్లు చెల్లిస్తేనే ఈ షేరింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
భారత్‌లో ట్యాక్స్..?
భారత్‌లో ఐటీ శాఖ నెట్‌ఫ్లిక్స్‌పై (Tax on Netflix in India) ట్యాక్స్ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో స్ట్రీమింగ్ సర్వీసెస్ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓ రిపోర్ట్ ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇదే ఆచరణలోకి వస్తే...విదేశీ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించడం ఇదే తొలిసారి అవుతుంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ కామర్స్ సర్వీసెస్ అందించే కంపెనీల్లో నెట్‌ఫ్లిక్స్ తొలిసారి ఈ ట్యాక్స్‌ను ఎదుర్కొనే అవకాశముంది. ఇందుకు ప్రధాన కారణం...నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ ( Permanent Establishment) అవ్వడమే. అమెరికాలో హెడ్‌క్వార్టర్స్ ఉన్నప్పటికీ...ఇండియాలోనూ పెద్ద ఎత్తున సర్వీసెస్ అందిస్తోంది ఈ సంస్థ. ప్రపంచంలోనే పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ భారత్‌లోనూ బాగానే సంపాదిస్తోందన్న విషయం ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఓ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం...2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ రూ.55 కోట్లు ఆర్జించిందని ఐటీ అధికారులు తెలిపారు. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు ఉద్యోగులున్నారని, ఆఫీస్‌లు కూడా ఉన్నాయని చెప్పారు. పేరెంట్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున నిధులూ వస్తున్నాయని తేలింది. అందుకే...ఈ సర్వీస్‌ని Permanent Establishmentగా పరిగణిస్తున్నట్టు ఐటీ శాఖ వివరించినట్టు తెలుస్తోంది. 2016లో భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సర్వీస్‌లు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఇండియాలో దాదాపు 60 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ (Netflix Subscribers in India) ఉన్నారు.
Also Read: Sourav Ganguly: త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ, పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ చర్చ
Kuja Dosha Verdict: అత్యాచార బాధితురాలి జాతకాన్ని కోరిన అలహాబాద్ హైకోర్టు - ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
ABP Desam Top 10, 3 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 316 మంది ఏపీ వాసులు సురక్షితం, 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్!
Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్, రైళ్లల్లో భద్రతపై ప్రశ్నల వర్షం
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?