News
News
X

Nellore News: వైసీపీ జెండాలు ఉంటేనే వాహనాలు తిరిగేది- ఎమ్మెల్యేపై వ్యక్తి ఆరోపణలు- అనంతరం ఆత్మహత్యాయత్నం!

Nellore News: వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటానంటూ వీడియో విడుదల చేసి మరీ బలవన్మరణానికి యత్నించాడో దళిత యువకుడు. 

FOLLOW US: 
Share:

Nellore News: వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన రేషన్ దుకాణాన్ని తొలగించారని.. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదంటూ ఓ యువకుడు వీడియో విడదుల చేశాడు. అంతే కాకుండా ఎమ్మెల్యే తనపై ఎందుకంత కక్ష పెంచుకున్నారో కూడా తెలియట్లేదని, వైసీపీ ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణం అని వివరించాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసలేం జరిగిందంటే..?

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతలకు చెందిన పైడి శ్రీహర్ష కావలి ఎమ్మెల్యే ఇంటి సమీపాన ఆత్మహత్యా యత్నం చేశాడు. ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. పాత్రికేయులు అక్కడికి వెళ్లే లోపు ద్విచక్ర వాహనంపై ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లిపోయారు. అప్పటికే కొంత పురుగుల మందు తాగారు. ఆడ్టీఓ కార్యాలయం వద్ద మరికొంత తాగి కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నాయకులు, విలేకరులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసే ముందు శ్రీహర్ష తన ఆవేదనను వీడియోలో చిత్రీకరించారు. తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే, పోలీసులు, వైసీపీ నాయకుల వేధింపులే కారణం అని అందులో పేర్కొన్నారు. వారి వల్ల తన జీవనోపాధి పోయిందని వాపోయారు. 

వైసీపీలోకి చేరకపోవడంతో రౌడీషీట్ తెరిపించిన నాయకులు..

శ్రీహర్ష తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు. అయితే అతడిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. అందుకు శ్రీహర్ష నిరాకరించడంతో అతనిపై వేధింపులు ప్రారంభం అయ్యాయి. ఆ కక్ష పెట్టుకుని అతనిపైన పోలీసులతో రౌడీషీట్ తెరిపించారు. దీంతో తీవ్ర వేదనకు గురైన శ్రీహర్ష సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తనను తీవ్రంగా వేధించారని శ్రీహర్ష వివరించారు. ఆయన ముఖ్య అనుచరుడు, కావలి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి సహా మరికొందరు కూడా హెచ్చరించారని చెప్పారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రేషన్ దుకాణాన్ని తొలగించారని, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదన్నారు. ఎకరం పొలం విక్రయించగా వచ్చిన సొమ్ముతో పాటు బ్యాంకు రుణం తీసుకొని రెండు టిప్పర్లు, ట్రాక్టర్, పొక్లెయినర్ కొనుక్కొని జీవిస్తున్నానని.. కానీ పోలీసులు తన టిప్పర్లను అడ్డుకుంటున్నారని వివరించారు. 

ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేసిన పోలీసు

వైసీపీ జెండాలు కడితేనే వాహనాలు తిరగనిస్తామని అధికార  పార్టీలు నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు. బిట్రగుంట పోలీస్ స్టేషన్ కు పలుమార్లు తీసుకెళ్లారన్నారు. పోలీసులు అడిగినంత ఇచ్చినా వేదింపులు ఆగలేదన్నారు. కావలి రూరల్ సీఐ రాజేశ్ మరింతగా వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. వైసీపీ నాయకులు, పోలీసుల వేధింపులతో తన కుటుంబం పస్తులు ఉంటోందని శ్రీహర్ష వాపోయారు. మామూళ్లు ఇవ్వాలంటూ శ్రీహర్షతో కానిస్టేబుల్ అయోధ్య మాట్లాడినట్లు ఆడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఆత్మహత్య విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారని. అక్కడే కావలి ఒకటో పట్టణ ఎస్సై మహేంద్ర.. శ్రీహర్ష భార్య ననుంచి పోన్లు తీసుకునేందుకు యత్నించాడు. విషయం గుర్తించిన టీడీపీ శ్రేణులు కేకలు వేయడంతో వెనక్కి తగ్గారు.  

Published at : 29 Dec 2022 09:41 AM (IST) Tags: AP News ycp vs tdp Nellore News Latest Suicide Case TDP Activist Suicide Attempt

సంబంధిత కథనాలు

Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు

Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు

Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Avantika Mishra: నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తున్న అవంతిక మిశ్రా

Avantika Mishra: నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తున్న అవంతిక మిశ్రా