అన్వేషించండి

Neet Controversy 2024: పేపర్ లీక్ చేయాలంటేనే వణుకు పుట్టేలా కఠిన చర్యలు, యోగి సర్కార్ కొత్త చట్టం

Neet Controversy: నీట్‌ ఎగ్జామ్ పేపర్ లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న క్రమంలో యూపీ సర్కార్ కొత్త చట్టం తీసుకురానుంది. పేపర్‌ లీక్‌లను అడ్డుకునేందుకు ఈ చట్టం చేయనుంది.

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్‌లో ఈ తరహా పేపర్ లీక్‌లు కాకుండా ప్రత్యేకంగా చట్టం తీసుకు రానుంది. లీక్ రాయుళ్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయనుంది. పేపర్ లీక్‌కి పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో ప్రొవిజన్స్‌ చేసింది. భారీ జరిమానాలతో పాటు బుల్‌డోజర్‌లో ఇళ్లు కూలగొట్టడం, జైలుకి పంపడం లాంటి చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు యోగి సర్కార్‌ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్‌తో National Testing Agency (NTA) పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డార్క్‌నెట్ వేదికగా పేపర్ లీక్ అయిందని కేంద్రవిద్యాశాఖ వెల్లడించింది. దీంతో పాటు మరి కొన్ని అవకతవకలూ జరిగినట్టు విచారణలో తేలింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎగ్జామినేషన్ ప్రాసెస్‌లో ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. పేపర్‌ కౌంటింగ్‌ని కట్టడి చేసేందుకూ కొత్త చట్టం తీసుకురానుంది. పేపర్ ప్రింటింగ్‌ బాధ్యతల్ని రెండు వేరు వేరు ఏజెన్సీలకు అప్పగించి లీక్‌లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. పేపర్ కోడింగ్ ప్రక్రియనూ మరింత కఠినతరం చేసే యోచనలో ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో మాత్రమే ఎగ్జామ్స్‌ నిర్వహించాలని భావిస్తోంది. క్లీన్ చిట్ ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు నిర్వహించనుంది. 

ఇవీ చర్యలు..

ఎగ్జామ్ సెంటర్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయనుంది. ఇక ఎగ్జామ్ నిర్వహణ బాధ్యతలు నాలుగు వేరు వేరు ఏజెన్సీలకు అప్పగించాలని యోగి సర్కార్ భావిస్తోంది. ఇక పరీక్ష రాసే అభ్యర్థులకు సొంత ఊరిలో కాకుండా వేరే చోట ఎగ్జామ్ సెంటర్ వచ్చేలా ప్లాన్ చేయనుంది. ఈ నిబంధన నుంచి దివ్యాంగులకు, మహిళలకు మినహాయింపు ఉంటుంది. 4 లక్షల కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే రెండు విడతల్లో నిర్వహించాలని యోచిస్తోంది. Provincial Civil Service ఎగ్జామ్‌ని మాత్రం ఒకే విడతలో నిర్వహించాలని చూస్తోంది. ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు రాకుండా OMR షీట్స్‌ని స్కాన్ చేయనుంది. క్వశ్చన్ పేపర్స్‌కి యునిక్ బార్‌కోడ్స్,సీరియల్ నంబర్స్‌ పెట్టనున్నారు. పేపర్‌ల రవాణాలోనూ ఎక్కడా ట్యాంపర్ కాకుండా చాలా పక్కాగా ప్యాక్ చేసేలా చూడనున్నారు. ప్రింటింగ్ ఏజెన్సీలపై  పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని యోగి సర్కార్‌ చూస్తోంది. ప్రింటింగ్ ప్రెస్‌ల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించనుంది యూపీ ప్రభుత్వం. ఎవరికి పడితే వాళ్లకి కాకుండా అథెంటికేషన్ ఉన్న వాళ్లకే ఆ బాధ్యతలు అప్పగించనుంది. ప్రింటింగ్‌ ప్రెస్‌లోకి వచ్చే వాళ్లను స్క్రీనింగ్ చేస్తారు. ID కార్డులుంటే తప్ప లోపలికి అనుమతించరు. ఇక బయటి వ్యక్తులకు ఏ మాత్రం అనుమతి ఉండదు. ప్రింటింగ్ ప్రెస్‌లో స్మార్ట్‌ ఫోన్‌లు, కెమెరాల వినియోగంపై ఆంక్షలు విధించనుంది. ప్రింటింగ్ ప్రెస్ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టనున్నారు. దాదాపు ఏడాది పాటు అందులో రికార్డ్స్ ఉండేలా చూసుకోనున్నారు. 

Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి మళ్లీ ఝలక్, బెయిల్‌పై స్టే విధించిన హైకోర్టు - అప్పటి వరకూ జైల్లోనే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Fake PM Kisan Yojana App: ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
Embed widget