అన్వేషించండి

Navi Soch Nava Punjab Virtual Rally: పంజాబ్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ... నవీ సోచ్ నవ పంజాబ్ పేరిట వర్చువల్ ర్యాలీ

పంజాబ్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ పంజాబ్ లో జలంధర్ లో నవీ సోచ్ నవ పంజాబ్ వర్చువల్ ర్యాలీని ప్రారంభించారు. ఆ ర్యాలీలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పాల్గొన్నారు.

పంజాబ్ లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది.  ‘నవీ సోచ్‌ నవ పంజాబ్‌’ పేరిట వర్చువల్‌ ర్యాలీ చేపట్టింది.  ఈ ర్యాలీని కాంగ్రెస్ ఇటీవల కాలంలో అత్యంత విజయవంతమైన డిజిటల్ ర్యాలీలలో ఒకదానిని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీలోని వివిధ శాఖలు పూర్తి సమన్వయంతో గ్రాండ్ వర్చువల్ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొంది. పంజాబ్‌లోని జలంధర్‌లోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ ర్యాలీని ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొ్న్నారు. కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీలో ప్రసంగించారు. జలంధర్ వేదిక ప్రారంభించిన డిజిటల్ ర్యాలీని రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలు, పంజాబ్‌లోని 22 జిల్లా కేంద్రాల్లో ఎల్ఈడీల ద్వారా కనెక్ట్ చేశారు. ఇక్కడ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 300 మంది వరకు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ డిజిటల్ ర్యాలీని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే సమయంలో 50,000 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇప్పటికే 400000 కంటే ఎక్కువ మంది సోషల్ మీడియాలో 30 వేల కామెంట్స్, 9000 షేర్ల చేశారని కాంగ్రెస్ తెలిపింది. ఈ ర్యాలీ జరిగిన రెండు గంటల్లోనే 9 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని కాంగ్రెస్ పేర్కొంది. ఇది దేశంలోనే అత్యంత విజయవంతమైన హైబ్రిడ్ వర్చువల్ ర్యాలీ అని  వెల్లడించింది. 

పంజాబ్ లో బిజీబిజీగా రాహుల్ 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్‌లో ఒక రోజు పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 117 మంది అభ్యర్థులతో కలిసి దుర్గియానా మందిర్, భగవాన్ వాల్మీకి తీర్ లో పూజలు చేశారు. గాంధీ ఆ తర్వాత రోడ్డు మార్గంలో జలంధర్‌కు వెళ్లారు. అక్కడ జలంధర్‌లోని మిథాపూర్‌లోని వైట్ డైమండ్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్ ర్యాలీ "నవీ సోచ్ నవ పంజాబ్"లో పాల్గోని ప్రసంగించారు. ఈ నెల ప్రారంభంలో ఎన్నికల సంఘం భౌతిక ర్యాలీలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తర్వాత రాహుల్ గాంధీ తొలిసారిగా పర్యటించారు. ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget