Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్ ఫాలో అవుతున్న పోలీసులు
Viral News: యూపీ పోలీసులు RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
Uttar Pradesh Police RRR:
రెడ్‌లైట్ దాటొద్దని చెబుతూ..
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమా గురించి దేశం మాట్లాడుకునేది. ఇప్పుడు ప్రపంచమే మాట్లాడుకుంటోంది. RRR ఇచ్చిన పుష్ ఇది. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ సినిమాపైనే చర్చ అంతా. గ్లోబల్ అవార్డ్ అందుకున్న తరవాత ఈ ఖ్యాతి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా నాటునాటు పాట అన్ని దేశాల్లోనూ భాషతో సంబంధం లేకుండా మారు మోగుతోంది. చాలా మంది ఈ డ్యాన్స్‌ని రీక్రియేట్ చేసి మరీ ట్రిబ్యూట్ ఇస్తున్నారు. కొన్ని ఇండియన్ కంపెనీలు ఈ ట్రెండ్‌ని కొనసాగిస్తున్నాయి. మొన్న జొమాటో, స్విగ్గీ కూడా నాటునాటు హుక్ స్టెప్‌ని లొకేషన్ ట్రాకింగ్‌లో చేర్చాయి. ఇంకా ఈ హవా నడుస్తూనే ఉంది. ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగానే పోలీసులూ అప్‌డేట్ అవుతున్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు RRRను వాడుకున్నారు. RRR పోస్టర్‌ని ట్రాఫిక్ రూల్‌కి అనుగుణంగా ఎడిట్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. RRRని సూచించేలా " Respect the Red light on the Road" అని ఎడిట్ చేశారు. రెడ్‌లైట్ పడినప్పుడు తప్పకుండా ఆగాలి అని ఈ స్టైల్‌లో చెప్పారన్నమాట. ఈ ఫోటోతో మరి కొన్ని రూల్స్‌నీ చెప్పారు పోలీసులు. బైక్‌పై ఇద్దరి కన్నా ఎక్కువ ఉండకూడదని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయొద్దని వివరించారు. ఇలా చెబితే ప్రజలకు
తొందరగా అర్థమవుతుందని ఈ ట్రెండ్‌ని ఫాలో అయిపోయారు. గతంలోనూ ఇలా మూవీల రిఫరెన్స్ తీసుకుని ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు పలు రాష్ట్రాల పోలీసులు. చాలా చోట్ల హోర్డింగ్‌లనూ పెట్టారు.
"ప్రజల్ని చైతన్యపరిచేందుకే నాటునాటు పాట రిఫరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడే కాదు. చాలా రోజులుగా మేము బాలీవుడ్ పాటల్ని ఇలా రిఫరెన్స్‌గా తీసుకుని రూల్స్ గురించి చెబుతున్నాం. మహిళా భద్రతతో పాటు మరి కొన్ని విషయాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం"
- యూపీ పోలీసులు
The nominations for Golden Glob(al) rules of #RoadSafety ; #Naatu,Kabhi red light skip kare#Naatu,Kabhi tripling kare#Naatu,Kabhi drunken driving kare#Naatu,Kabhi traffic rules tode
— UP POLICE (@Uppolice) January 11, 2023
Congratulating the makers of #RRR for winning the Best Original Song award #GoldenGlobes2023 pic.twitter.com/y5vZhT0WMK
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలోనూ సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ అనే పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును అందుకుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ ఐకానిక్ పాట వెనుకున్న ప్రముఖ సంగీత స్వరకర్త ఎం ఎం కీరవాణి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఎన్నో అద్భుత పాటలను రూపొందించారు.