అన్వేషించండి

Aadhar : ఆధార్ సాయంతో ఆరేళ్లకు ఇంటికి చేరిన కొడుకు - ముంబై కుటుంబ వేదనకు కడపలో కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

Kadapa : ఆ పిల్లవాడికి ఎనిమిదేళ్లు. ముంబైలోని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ దారి తప్పాడు. ఆరేళ్లలో ఎక్కడెక్కడో తిరిగి కడపకు చేరుకున్నాడు. కానీ ఆధార్ ఆ పిల్లవాడ్ని మళ్లీ ఇంటికి చేర్చింది.

6 years later Aadhaar helps reunite missing boy : అది ముంబైలోని విక్రోలి ప్రాంతం. ఆరేళ్ల కిందట తమ పిల్లవాడు తప్పిపోయాడు లేకపోతే కిడ్నాప్ చేశారని ఓ కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది. ఎంత వెదికినా పోలీసులుకు క్లూ లభించలేదు. చివరికి ఆ పిల్లవాడు తన నాయనమ్మతో పాటు బయటలుదేరాడు. తనతో  పాటు మనవడు వస్తున్న విషయాన్ని ఆ నాయనమ్మ గుర్తించలేదు. మధ్యలో మిస్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. అప్పటికి ఆ బాలుడికి ఎనిమిదేళ్లు. అధార్ కార్డు కూడా ఉంది. దాంతో ఎక్కడైనా  ఆధార్ డేటాబేస్‌లో నమోదు అయితే సమాచారం వస్తుందని పోలీసులు చెప్పి పంపించారు. కానీ ఆ కుర్రవాడికి ఆధార్ నెంబర్ తెలియదు. ఎప్పుడైనా  మళ్లీ ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నిస్తేనే తెలుస్తుంది. 

ముంబైలో తప్పిపోయి ఆరేళ్ల తర్వాత కడపలో ప్రత్యక్షం

అలా తప్పిపోయిన పిల్లవాడు ఆరేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో కనిపించాడు.  కడపలో ఆధార్ కేంద్రంలో ఆధార్ నమోదు చేసుకునేందుకు ఓ పధ్నాలుగేళ్ల పిల్లవాడ్ని ఓ వ్యక్తి తీసుకు వచ్చాడు. కానీ అప్పటికే అతని ఆధార్ డేటాబేస్‌లో ఉన్నట్లుగా తేలింది. ఆ అడ్రస్ మంబైలో ఉంది. ఆ కుర్రవాడితో పాటు ఉన్న వ్యక్తి కూడా ఆ పిల్లవాడి తల్లిదండ్రులను సంప్రదించాడు. దాంతో వారంతా కడప వచ్చి తమ బిడ్డను చూసి కన్నీరు పెట్టుకున్నారు. మిస్సయిన ఆరేళ్లకు మల్లీ కనిపించిన బిడ్డను హత్తుకుని తనివి తీరా ఏడ్చారు. ఆ బిడ్డ కూడా అంతే. 

ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించడంతో డేటాబేస్ ద్వారా తెలిసిన ఆచూకీ 

ఈ ఆరేళ్ల కాలంలో ఆ పిల్లవాడి లైఫ్ జర్నీ పూర్తిగా మారిపోయింది. ఎంతగా అంటే మొదట ముంబైలో దిక్కులు చూస్తున్న అ పిల్లవాడ్ని  ఓ మహిళ  గుర్తించి కర్ణాటకలోని  తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ మహిళ భర్త తాగుబోతు. రోజూ వచ్చిభార్యను కొట్టేవాడు. ఆ భయంతో ఓ రోజు దగ్గరలోని రైల్వే స్టేషన్‌ కు వెళ్లి రైలెక్కేశాడు. ఆ రైలు తిరుపతికి చేరింది. అక్కడ ఒంటరిగా ఉన్న పిల్లవాడ్ని గుర్తించి  తెలుగు కూడా సరిగ్గా మాట్లాడకపోవడంతో సంరక్షణా కేంద్రానికి తరలించారు. కొద్ది రోజులు అక్కడ ఉన్న మరో కుర్రాడితో కలిసి పారిపోయారు. కడపకు వెళ్లి అక్కడ పని చేసుకోవడం ప్రారంభించారు. ఓ రోజు తాము పని చేస్తున్నహోటల్ నుంచి డబ్బులు తీసుకుని తోటి కుర్రాడు పరారయ్యాడు.దాంతో ఈ పిల్లగాడు ఒంటరిగా మిగిలాడు. అయితే కడపలోని ఓ వ్యక్తి చేరదీసి చిన్న చిన్న పనులు చేయించుకుంటూ పోషిస్తున్నాడు. ఓ స్కూల్ లో కూడా చేర్చాడు. 

హిందీ, మరాఠీ మర్చిపోయిన పిల్లగాడు - తెలుగు మాత్రమే 

అయితే అతనికి ఆధార్ కార్డు రిజిస్టర్ చేయాల్సించిన అవసరం రావడంతో అతని కుటుంబం గురించి తెలిసింది.  ముంబైలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి హిందీ , మరాఠీ, ఇంగ్లిష్ వచ్చు. కానీ ఇప్పుడు తెలుగు తప్ప ఏమీ రాదు. తన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహిుతులు అందర్నీ ముంబైలో గుర్తు పట్టాడు కానీ..వారితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. సగం సగం హిందీలో మాట్లాడుతున్నాడు. తెలుగు మాత్రం బాగా వచ్చింది.హిందీ, మరాఠీని త్వరలో నేర్చుకుంటాడని.. తమ బిడ్డ తిరిగి వచ్చినందుకు వారు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
Kohinoor Part 1: యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
Vishwambhara Teaser: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చెల్లాచెదురైన భాగమతి ఎక్స్‌ప్రెస్, భయంకరంగా డ్రోన్ విజువల్స్Revanth Reddy: ‘మీకు సదువు ఎందుకురా, మీ మోహానికి బర్రెలు కాసుకోండి’CM Yogi Adityanath Kanya pujan | దసరా నవరాత్రుల ప్రత్యేక పూజ చేసిన గోరఖ్ పూర్ పీఠాధిపతి | ABP DesamPak vs Eng 1st Test Records | ముల్తాన్ టెస్ట్ మీద విరుచుకుపడుతున్న టెస్టు ప్రేమికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
Kohinoor Part 1: యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
Vishwambhara Teaser: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
Vijayawada Temple: దారులు ముసుకుపోవడంతో భక్తులు సాహసం, దుర్గమ్మ దర్శనం కోసం పడరాని పాట్లు!
Vijayawada Temple: దారులు ముసుకుపోవడంతో భక్తులు సాహసం, దుర్గమ్మ దర్శనం కోసం పడరాని పాట్లు!
Iran Israel Crisis: ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
Balakrishna New Movie: బాలకృష్ణ -  బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?
బాలకృష్ణ - బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?
Andhra Pradesh : ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
Embed widget