Cruise Ship Drugs Case: మరో ఐదు రోజుల పాటు జైల్లోనే ఆర్యన్ ఖాన్!
ఆర్యన్ ఖాన్ మరో ఐదు రోజులపాటు జైల్లోనే ఉండనున్నాడు. అతని బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌పై తీర్పును అక్టోబర్ 20 వరకు రిజర్వ్‌లో ఉంచింది ముంబయి సెషన్స్ కోర్టు. దీంతో మరో ఐదు రోజులపాటు ఆర్యన్ ఖాన్ సహా అర్బాజ్ సేత్ మర్చెంట్, మున్‌మున్ ధామేచా జైల్లోనే గడపనున్నారు.
Drugs on cruise matter | Mumbai Special NDPS court reserves order for 20th October on bail application of Aryan Khan, Arbaaz Merchant and Munmun Dhamecha
— ANI (@ANI) October 14, 2021
బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ సందర్భంగా ఎన్‌సీబీ తరఫున ఏఎస్‌జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ తరుచు తీసుకుంటాడని.. అతని వద్ద డ్రగ్స్ దొరకేలేనంత మాత్రాన ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేయకూడదని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం తన తీర్పును అక్టోబర్ 20 వరకు రిజర్వ్‌లో ఉంచింది.
ఇదీ కేసు..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. సోమవారం అతడిని ముంబయి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతకు ముందే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతూ ఆర్యన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్యన్‌కు బెయిల్‌ను నిరాకరించిన న్యాయస్థానం.. అతనికి ఈ నెల 7వ తేదీ వరకూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Also Read: Varun Gandhi Tweet on Farmers: వాజ్‌పేయీ మాటలతో మోదీ సర్కార్‌కు వరుణ్ గాంధీ చురకలు
Also Read: Amit Shah on Pakistan: 'పాక్.. జాగ్రత్త!.. మితిమీరితే ఇక చర్చలు ఉండవు.. మెరుపుదాడులే'
Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!
Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం