Adani And Ambani: స్టాక్ మార్కెట్ బిలియనీర్ల ఆస్తులన్నీ పేకమేడలే - అంబానీ, అదానీ ఒక్క రోజులో ఎంత కోల్పోయారో తెలుసా ?
Money News : ప్రతి శుక్రవారం ఇక్క తలరాతలు మారిపోతూంటాయని సినీ జనాలు చెబుతూంటారు. అయితే స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నవారి జాతకాలు మాత్రం వారంలో ఐదు రోజులూ మారిపోతూంటాయి.
Mukesh Ambani Gautam Adani suffers loss of billions : లాభం వచ్చిందని ఎగిరి గంతేసినంత సేపట్లో ఉన్నదంతా ఊడిచి పెట్టుకుపోయేగే గేమ్ స్టాక్ మార్కెట్లో నడుస్తూ ఉంటారు. ఎవరి స్థాయిలో వారికి లాభాలు వస్తూంటాయి. నష్టాలు వస్తూంటాయి. స్టాక్ మార్కెట్లు ర్యాలీగా దూసుకెళ్లిన రోజు అదానీ, అంబానీల సంపద ఎంత పెరిగిందో గొప్పగా చెప్పుకుంటారు. మరి లాసులు వచ్చినప్పుపడు కూడా చెప్పుకోవాలి కదా. శుక్రవారం స్టాక్ మార్కెట్ కు బ్లాక్ ప్లైడే. లాభాలు కళ్ల జూసిన వాళ్లంతా నష్టపోయారు. అంబానీ, అదానీలు బిలియన్ల కొద్దీ నష్టపోయారు. వారి సంపద చాలా వరకూ కరిగిపోయింది.
రతన్ టాటా వీలునామాలో శంతనునాయడు పేరు - ఎన్ని ఆస్తులు రాసిచ్చారంటే ?
ప్రపంచ ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అదానీ గ్రూపు చైర్మన్ గౌత్ అదానీ ఒక్క రోజులో 352 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అంే మన రూపాయల్లో 296039877760. ఉజ్జాయింపుగా చెప్పుకోవాలంటో 29వేల కోట్లు పైనే. ఈ కారణంగా అదానీ వ్యక్తిగత సంపద 90 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. అయితే సంపద సూచిలో ఆయన పద్దెనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక మరో కుబేరుడు అంబానీ.. అదానీ అంత స్థాయిలో కాకపోయినా బాగానే నష్టపోయారు. ఆయన వంద బిలియన్ డాలర్ల వరకూ నష్టపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా గ్రూపు కంపెనీల షేర్ల ధరలు 0.91 శాతం మేర తగ్గిపోయాయి. దీని కారణంగావంద బిలియన్ల మేర కంపెనీలు నష్టపోయాయి. ఆయన సంపదలో 97.7 కోట్లు తగ్గిపోయాయి. అయితే ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 17వ స్థానంలో కొనసాగుతున్నారు.
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ప్రస్తుతం ఎలాన్ మస్క్ ప్రపంచ ధనవంతుడు. ఆయన 277 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయన సంపద ఆరున్నర బిలియన్ డాలర్ల వరకూ పెరిగింది. ఇక అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 211 బిలియన్ డాలర్లు. 203 బిలియన్ డాలర్లతో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ మూడో స్థానంలో ఉన్నారు.
తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
వ్యాపార సంస్థల విలువ, వాటిలో ఉన్న షేర్ల విలువను పట్టి పారిశ్రామికవేత్తల సంపదలో మార్పులు వస్తూంటాయి. కంపెనీ పనితీరుపై ఇన్వెస్టర్లకు మెరుగైన నమ్మకం ఉంటే పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేస్తారు. అటోమేటిక్ గా కంపెనీ షేర్ల పెరుగుతుంది. షేర్ల విలువ పెరిగితే కంపెనీ విలువ పెరుగుతుంది. మార్కెట్లు పడిపోయిన రోజు.. షేర్లను ఇన్వెస్టర్లను అమ్మేసిన రోజున విలువ పడిపోతుంది. అప్పుడు వారి సంపద విలువ కూడా తగ్గిపోతుంది.