అన్వేషించండి

లిబియాలో వరద బీభత్సం, 2000 మంది మృతి!

తూర్పు లిబియాలో వరదలు వణికించాయ్. వరద బీభత్సం కారణంగా 2000 మంది ప్రాణాలు కోల్పోయారు.

మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. వరద బీభత్సంతో 2వేల మందికి ప్రాణాలు కోల్పోయారు.  వేలాది మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డేనియల్ తుపాను మధ్యధరా సముద్ర ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపింది. టర్కీ, బల్గేరియా, గ్రీస్‌లు కుండపోత వర్షాలతో అతలాకుతలమయ్యాయి. తాజాగా లిబియాలో భారీ వరదలు సంభవించాయ్. దీంతో ఎత్తయిన భవనాలు నేలమట్టమయ్యాయి. వీధుల్లో వరదనీరు అడుగుల మేర నిలిచిపోయింది.  డేనియల్‌ తుపాను ప్రభావంతో డెర్నా, జబల్‌ అల్ అఖ్దర్‌, అల్‌-మార్జ్‌ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 

దెర్నా నగరంలో సంభవించిన వరదల ధాటికి 2వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రధానమంత్రి ఒసామా హమద్ తెలిపారు. దెర్నాలోని అనేక ప్రాంతాలు వరదలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ తుపాను ధాటికి ఇప్పటికే తూర్పు లిబియాలోని అనేక ప్రాంతాల్లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా నగరంలో పరిస్థితి భయానకంగా మారింది. విద్యుత్​ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. చుట్టూ వరద నీరు చేరడం వల్ల ఇళ్లల్లో ఉన్న ప్రజలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొందరికి ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు.  దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరదల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కకుపోయారు. సైన్యం, సహాయక బృందాలు వారిని రక్షించడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి. 

డెర్నా పట్టణంలోని నదిపై ఉన్న ఆనకట్ట వరదలతో కూలిపోవడంతో విపత్తు సంభవించిందని లిబియా నేషనల్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారీ చెప్పారు. ఈ వరద విపత్తులో గల్లంతైన వారి సంఖ్య 6 వేలమంది దాకా ఉంటుందని వెల్లడించారు. గత వారం గ్రీస్ దేశాన్ని ముంచెత్తిన తుపాన్ విపత్తు మధ్యధరా సముద్రంలోకి దూసుకెళ్లింది. వరదల వల్ల డెర్నా నగరంలో భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. లిబియాలోని సముద్ర తీరంలోని భవనాలు ధ్వంసం అయ్యాయి.

ఆరు మిలియన్లకుపైగా జనాభా కలిగిన లిబియా.. దశాబ్దానికిపైగా ఘర్షణలతో సతమతమవుతోంది. మౌలిక సదుపాయాల లేమితో బాధపడుతోంది. 2011లో నాటో మద్దతుతో కూడిన తిరుగుబాటు కారణంగా నియంత గడాఫీ మరణం తర్వాత లిబియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!

వీడియోలు

సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Embed widget