Money Laundering Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మళ్లీ నిరాశ- కస్టడీ పొడిగింపు!
Money Laundering Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మరోసారి కస్టడీ పొడిగించింది కోర్టు.
Money Laundering Case: మనీ లాండరింగ్ కేసులో శివసనే ఎంపీ సంజయ్ రౌత్‌కు మరోసారి కస్టడీ పొడిగించింది కోర్టు. మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Money laundering case | Mumbai PMLA Court extends the judicial custody of Shiv Sena (Uddhav Thackeray) leader & MP, Sanjay Raut by 14 more days. pic.twitter.com/xvggQrhBz1
— ANI (@ANI) November 2, 2022
ఇదీ జరిగింది
దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు.. సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆగస్టు 1 అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదే కేసు
2007లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం పత్రచాల్ ప్రాంతంలో 3వేల ఫ్లాట్లు నిర్మించడానికి గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌కు 1034 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కేటాయించింది. ఇందుకోసం 47 ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించింది. గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్ రౌత్.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి సంజయ్ రౌత్ సతీమణి వర్షకు 55 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. అంతేకాక, మాధురి, వర్షా కలిసి ఆలీబాగ్‌లో ఓ భూమి కూడా కొనుగోలుచేశారు. ఈ ల్యాండ్ డీల్‌పైనా ఈడీ కూపీ లాగుతోంది. ఈ కేసులోనే రౌత్ ఆస్తులు అటాచ్ చేసింది.
ఈ కేసులో అరెస్ట్‌కు ముందు కూడా సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
" నా ఆస్తులు జప్తు చేయండి, కాల్పులు జరపండి, జైలుకు పంపండి, ఏమాత్రం భయపడను. నేను బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడిని, నిజమైన శివసైనికుడిని. అతను పోరాడతాడు, ప్రతి ఒక్కరి వ్యవహారం బయటపెడతాడు. చూస్తూ కూర్చునే రకం కాదు. వాళ్లను డాన్స్ చేయనీయండి. చివరికి నిజమే గెలుస్తుంది. "
Also Read: Sachin Pilot On PM Modi: వేడెక్కిన రాజస్థాన్ రాజకీయం- గహ్లోత్‌పై సచిన్ పైలట్ డైరెక్ట్ అటాక్!