Lakhimpur Kheri: 'మోదీ జీ.. 28 గంటలుగా ఎందుకు నన్ను కస్టడీలో ఉంచారు? లఖింపుర్ రండి'
ప్రధాని నరేంద్ర మోదీకి పలు ప్రశ్నలను సంధిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ప్రధానిని లఖింపుర్ రావాలని కోరారు. రైతుల బాధలను వినాలన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలోని సీతాపుర్‌లో ప్రియాంక గాంధీని నిర్బంధించిన పీఏసీ అతిథి గృహం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తనను ఎందుకు నిర్బంధిచారో సమాధానం చెప్పాలని ప్రియాంక.. ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు.
రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్తోన్న ఓ వీడియోను కూడా ప్రియాంక పోస్ట్ చేశారు. ఇది లఖింపుర్ ఘటనకు సంబంధించిన వీడియోగా ప్రియాంక చెబుతున్నారు. మరో వీడియోను కూడా ప్రియాంక పోస్ట్ చేశారు. ప్రధాని మోదీని లఖింపుర్‌లో పర్యటించాలని ఇందులో ప్రియాంక కోరారు.
.@narendramodi जी आपकी सरकार ने बग़ैर किसी ऑर्डर और FIR के मुझे पिछले 28 घंटे से हिरासत में रखा है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 5, 2021
अन्नदाता को कुचल देने वाला ये व्यक्ति अब तक गिरफ़्तार नहीं हुआ। क्यों? pic.twitter.com/0IF3iv0Ypi
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 5, 2021
నిన్న అదుపులోకి..
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ హింసాత్మక ఘటన, తన అరెస్ట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఏబీపీ న్యూస్‌తో నిన్న ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, యోగి సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తన కుమారుడు ఆశిష్‌కు ఈ ఘటనకు ఎలాంచి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు.
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..





















