Kerala : ఎమ్మెల్యే చనిపోయాడని కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం .. కేరళ సీఎంకు షాకిచ్చిన హైకోర్టు !
చనిపోయిన ఎమ్మెల్యే కొడుక్కి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడాన్ని కేరళ హైకోర్టు కొట్టి వేసింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే సానుభూతి ఓట్లు వస్తాయని ఆ కుటుంబంలో వారికి టిక్కెట్ ఇవ్వడం రాజకీయ పార్టీలకు అనాదిగా వస్తున్న సంప్రదాయం. దానిపై ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే అది రాజకీయ పార్టీల ఇష్టం. కానీ ఎమ్మెల్యే చనిపోయాడని ఆయన వారసత్వానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం మాత్రం అనూహ్యమే. అలాంటి నిర్ణయం తీసుకుంటే విమర్శలు కూడా వస్తాయి. ఎందుకంటే ఎమ్మెల్యే ను ప్రజలు ఎన్నుకొంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగి అలా కాదు. ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయినంత మాత్రం .. ఆ కారణంతో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అసాధారణం. అలాంటి ఆలోచనలు సాధారణంగా రాజకీయ పార్టీలు చేయవు.
Also Read : ఒమిక్రాన్ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు
కానీ కేరళ ముఖ్యమంత్రి మాత్రం ఇలాంటి ఆలోచనే చేశారు. చెంగనూరు ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల మరణిస్తే కేరళ ప్రభుత్వం అతని కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఆయన కుటుంబంలో సంపాదనా పరులెవరూ లేరు. దీంతో ముఖ్యమంత్రి చదువు పూర్తి చేసుకున్న ఆయన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. జూియర్ ఇంజినీర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వెంటనే విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి.
Also Read: Cyclone Jawad: 'జవాద్' ధాటికి ఒడిశా, ఉత్తరాంధ్రలో హైఅలర్ట్.. రంగంలోకి భారత నేవీ
అశోక్ కుమార్ అనే సామాజిక కార్యకర్త కోర్ట్ లో కేసు వేశాడు. దీనిపై కేరళ హైకోర్ట్ శుక్రవారం తుది తీర్పు ఇచ్చింది. ఈ నియామకం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజల నుంచి ఎన్నుకున్న నాయకుడు కేవలం 5 సంత్సరాలకు మాత్రమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యే కొడుకు ఉద్యోగం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ ఉద్యోగి కాదు అంటూ చురకలు అంటించింది.
Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
కేరళలో ఎమ్మెల్యేలు కోటీశ్వరులు కాదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అంటే కోటీశ్వరులే. వారి పుత్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు. లేకపోతే కేరళ తరహా వివాదాలు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించేవే.
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి