Viral News: బిజీ రోడ్డుపై కార్‌తో స్టంట్‌లు చేసిన మైనర్లు, స్కూటర్‌కి ఢీ - గాల్లోకి ఎగిరిపడి మహిళ మృతి
Viral Video: యూపీలోని కాన్‌పూర్‌లో బిజీ రోడ్డుపై మైనర్లు కార్‌తో స్టంట్‌లు చేశారు. ఓ స్కూటర్‌ని వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తల్లి ప్రాణాలు కోల్పోగా కూతురి పరిస్థితి విషమంగా ఉంది.
Viral News in Telugu: యూపీలో దారుణ ఘటన జరిగింది. కార్ నడిపిన మైనర్ ఓ స్కూటర్‌పైకి దూసుకెళ్లాడు. వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల స్కూటర్‌పైన ఉన్న తల్లి, కూతుళ్లు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో తల్లి ప్రాణాలు కోల్పోగా కూతురి పరిస్థితి విషమంగా ఉంది. 17 ఏళ్ల మైనర్ బిజీ రోడ్‌పైన కార్‌తో స్టంట్‌లు చేస్తున్నాడని, ఆ సమయంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. యూపీలోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మొత్తం సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. స్కూల్ బంక్ కొట్టి ఇలా రోడ్‌పైన సాహసాలు చేశాడు ఆ మైనర్. వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల ఆ ధాటికి ఇద్దరూ 20-30 అడుగుల దూరంలో పడిపోయారు. (Also Read: Kerala: ఈ ఫొటోలు చూశాక ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయకుండా ఉండలేం, వయనాడ్ హీరోలు వీళ్లే)
బలంగా రోడ్డుకి తల కొట్టుకోవడం వల్ల మహిళకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హాస్పిటల్‌లో చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. కూతురికీ తీవ్ర గాయాలయ్యాయి. ఎముకలు విరిగిపోయాయని, ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో మైనర్‌లు ఇలా సాహసాలు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. పుణేలో పోర్షే కార్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మైనర్‌లు అని కూడా చూడకుండా ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అప్పటి నుంచే సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
#कानपुर में रफ़्तार का क़हर स्कूल बंक मार कार में घूम रहे थे नाबालिक लड़के लड़कियां
— Gaurav Trivedi (@gaurav3vedi) August 3, 2024
तेज़ रफ़्तार कार से महिला और उसकी बेटी को मारी टक्कर।
महिला की मौक़े पर मौत तो वहीं बेटी की हालत गंभीर।
Accident का Cctv आया सामने। #कानपुर के साकेत नगर रोड @kanpurnagarpol @Uppolice @dgpup… pic.twitter.com/BUXOuvd0kb
ప్రస్తుతానికి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. ఇలాంటి వాళ్ల వల్ల రోడ్డు భద్రత లేకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెంటనే చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పుణే ఘటన తరవాత ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఆ కేసులో మైనర్ తప్పించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు. అందుకోసం అతని తల్లిదండ్రులూ సహకరించారు. విచారణ జరిపిన పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతోంది.