Minister Seethakka: అలాంటివారు ఇంటికి పోవడమే - మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్!
Medaram Jatara: జాతరలో జరిగే పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ట్రాన్స్‌ఫర్లు ఉండవు.. కానీ ఇంటికి పోవడం ఖాయమని అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు.
Sammakka Saralamma Jatara: ప్రజల విశ్వాసం లోకకళ్యాణార్థం జరుగుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జాతరలో జరిగే పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ట్రాన్స్‌ఫర్లు ఉండవు.. కానీ ఇంటికి పోవడం ఖాయమని అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు. ఆదివాసి సాంప్రదాయానికి ఎలాంటి ఆటంకం కలవకుండా, వనదేవతల పూజా విధానానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను నిర్వహిస్తామని మంత్రి అన్నారు. మేడారం పనుల సందర్శనలో భాగంగా మంత్రి సీతక్క ముందుగా అమ్మవార్లకు పూజలు నిర్వహించారు.
అనంతరం జాతరలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మేడారంలో జరుగుతున్న ప్రతి పని వద్దకు వెళ్లి అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు పనులు ఎప్పటివరకు అవుతాయి. నిధులు తదితర అంశాలపై అధికారుల నుంచి సమాచారం సేకరించడంతోపాటు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల ఇంటి లెవెల్పు మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలు అని మంత్రి సీతక్క అన్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 75 వేల కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టిందని ఆమె చెప్పారు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఒక టీముగా జాతరలో పనులను పూర్తి చేయడంతో పాటు జాతరను విజయవంతం చేయాలని మంత్రి చెప్పారు.
జాతరకు వచ్చే భక్తులు క్రమశిక్షణతో నేర్చుకోవాలని జాతర సమయంలో భక్తులు విచ్చలవిడిగా ప్లాస్టిక్, సీసాలు, వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తలు పాటించాలని సీతక్క అన్నారు. జాతరకు వచ్చే భక్తుల సంతోషంతో పాటు అడవిలో ఉన్న ప్రజల సంతోషం కూడా అవసరమని మనం పడేసిన అనేక రకాల వ్యర్ధాలతో జాతర ముగిసిన తర్వాత ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర రోగాల పాలవుతున్నారని సీతక్క అన్నారు. ఇలాంటి పరిస్థితులు బాధ్యతలు నడుచుకోవాలని సీతక్క కోరారు.