అన్వేషించండి

Minister Nagarjuna: తహసీల్దార్‌, ఎస్‌ఐలు ప్రతి వారం గ్రామాలకు వెళ్లాలి- మంత్రి మేరుగ నాగార్జున ఆదేశాలు

తహసీల్దార్లు, ఎస్.ఐలు వారంలో ఒక రోజు గ్రామాలకు వెళ్లి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రజల్లో చైతన్యం కలించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి మేరుగ నాగార్జున‌ సూచించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. ఈ చట్టంపై అవగాహన పెంచడం ద్వారానే దళితులపై దాడులు తగ్గించడానికి వీలు అవుతుందన్నారు. అదే టైంలో ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడటానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరును మంత్రి సమీక్షించారు.

సమీక్షలో నాగార్జున మాట్లాడుతూ... ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (పీసీఆర్) చట్టం ప్రకారంగా మండలాల్లో పని చేసే తహసీల్దారులు, ఎస్.ఐలు వారానికి ఒకసారి గ్రామాలకు వెళ్లి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. అయితే ఎవరూ కూడా గ్రామాలకు వెళ్లడం లేదని, ఈ చట్టం గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం వస్తే దళితులపై దాడులు చేయకూడదనే విషయంగా అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదనే విషయంగా దళిత వర్గాలకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. అందుకే తహసీల్దార్లు, ఎస్.ఐలు వారంలో ఒక రోజు గ్రామాలకు వెళ్లి ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం కలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో విచారణ ఏళ్ల తరబడిగా కొనసాగడం వల్ల సాక్షులను బెదిరించడం, కేసులు వెనక్కి తీసుకొనేలా ఒత్తిడి తీసుకురావడం జరిగే అవకాశం ఉంటుందని మంత్రి నాగార్జున అనుమానం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగడంలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతుందని చెప్పారు. ఈ కేసుల్లో విచారణను త్వరితగతిన ముగించి కోర్టుల్లో చార్జిషీట్లను దాఖలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో చాలా అత్యల్ప స్థాయిలోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయని, ఎక్కువ భాగం కేసులు కోర్టుల్లో వీగిపోవడం జరుగుతోందని నాగార్జున తెలిపారు. అతి తక్కువ శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీఐడీకి చెందిన అధికారులు మాట్లాడుతూ... కోర్టుకు వచ్చిన వాళ్లు తాము ఏసుక్రీస్తును పూజిస్తామని... చర్చిలకు వెళ్తామని, తమ ఇంట్లో బైబిల్ ఉందని చెప్పడం వల్లే వారు బీసీ-సీ వర్గానికి చెందిన క్రైస్తవులని ఎస్సీలు కాదని నిరూపితమవుతుందని అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, భగవంతుడిని ఆరాధించడానికీ, మతానికీ ముడిపెట్టకూడదని ఇలాంటి కారణాలతో కొట్టి వేసిన కేసుల వివరాలను తీసుకొస్తే ముఖ్యమంత్రి అనుమతితో అలాంటి కేసులను రీ ఓపెన్ చేయించడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధితులు అందించాల్సిన పరిహారం, ఉద్యోగ ఉపాధుల కేటాయింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్లకు డీఓ లెటర్లు రాయాలని నాగార్జున అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించే డీఎస్పీలను నియమించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎస్సీలపై జరిగే దాడుల విషయంగా 24 గంటలూ ఫిర్యాదులను స్వీకరించే కాల్ సెంటర్ సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దీన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. పీసీఆర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి తీసుకుంటున్న వినూత్న చర్యలను గురించి సీఐడీ అధికారులు మంత్రి నాగార్జునకు వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
ABP Desam Top 10, 18 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget