అన్వేషించండి

McDonald: బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు, మెక్‌డొనాల్డ్స్‌ స్టోర్‌కి రూ.5 కోట్ల ఫైన్

McDonald: చీజ్‌బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు కనిపించడంపై కస్టమర్ కంప్లెయింట్‌ చేయగా మెక్‌డొనాల్డ్స్‌ స్టోర్‌కు రూ.5 కోట్ల ఫైన్ వేశారు.

McDonald Cheese Burger: 


లండన్‌లో ఘటన..

లండన్‌లోని ఓ మెక్‌డొనాల్డ్ స్టోర్‌కి కోర్టు రూ.5 కోట్ల జరిమానా విధించింది. చీజ్ బర్గర్‌లో ఎలుక వ్యర్థాలు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ కస్టమర్ కంప్లెయింట్ చేశాడు. అధికారులు వచ్చి తనిఖీలు చేశారు. ఏ మాత్రం శుభ్రత పాటించడం లేదని గుర్తించి భారీ ఫైన్ వేశారు. కార్‌లో సరదాగా ట్రిప్‌కి వెళ్తున్న ఓ వ్యక్తి మధ్యలో మెక్‌డొనాల్డ్ స్టోర్ దగ్గర ఆగాడు. చీజ్ బర్గర్ ఆర్డర్ చేశాడు. రాపర్ ఓపెన్ చేసి తినబోతుండగా ఏదో తేడా కొట్టింది. దుర్వాసన వచ్చింది. వెంటనే పూర్తిగా తెరిచి చూశాడు. అందులో ఎలుక వ్యర్థాలు కనిపించాయి. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఆ కస్టమర్ హెల్త్ అఫీషియల్స్‌కి కంప్లెయింట్ చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు అధికారులు ఆ స్టోర్‌కి వచ్చారు. స్టోర్‌ మొత్తం పరిశీలించారు. ఏ మాత్రం నీట్‌నెస్ లేకుండా దారుణంగా మెయింటేన్ చేస్తున్నట్టు గుర్తించారు. ఒక్క బర్గర్‌లోనే కాదు. స్టోర్ మొత్తం ఎలుక వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ కనిపించాయి. ఫుడ్ ప్రిపేర్ చేసే చోటా ఇంతే దారుణంగా ఉంది. ఇక స్టాఫ్‌ కూడా ఏ మాత్రం శుభ్రత లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తానికి ఈ అంశం కోర్టు వరకూ వెళ్లింది. స్టోర్ యాజమాన్యంపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు మెక్‌డొనాల్డ్‌కి రూ.5 కోట్ల జరిమానా విధించింది. 

"స్టోర్‌లో  అమ్మే ఫుడ్ ఐటమ్స్‌ని శుభ్రమైన వాతావరణంలోనే తయారు చేశారన్న కాన్ఫిడెన్స్‌ని కస్టమర్స్‌కి ఇవ్వాల్సిన బాధ్యత స్టోర్ యాజమాన్యానిదే. కస్టమర్ చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు కంప్లెయింట్ చేయడం చాలా మంచిదైంది. ఇలా చేయడం వల్లే మేం వేగంగా విచారణ చేయగలిగాం"

- అధికారులు 

ఎలుక కొరికిందని థియేటర్‌కి ఫైన్..

సరదాగా థియేటర్‌కి వెళ్లింది. సినిమా బాగుందని ఎంజాయ్ చేస్తోంది. ఉన్నట్టుండి కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. ఆ తరవాత కొరికినట్టు అనిపించింది. వెంటనే చూసుకుంటే కాలికి రక్తం కారుతోంది. చుట్టూ చూస్తే ఎలుక పరిగెత్తుతూ కనిపించింది. అంతే. వెంటనే థియేటర్ యాజమాన్యంపై కోపంతో ఊగిపోయింది ఆ మహిళ. థియేటర్‌ని ఇలాగేనా మెయింటేన్ చేసేది అంటూ ప్రశ్నించింది. అయినా వాళ్లు పెద్దగా స్పందించలేదు. ఇది ఇంకాస్త అసహనానికి గురి చేసింది. లీగల్‌గానే చూసుకుంటానని వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చింది. వంటనే కన్జ్యూమర్ ఫోరమ్‌లో కంప్లెయింట్ చేసింది. దాదాపు 5 నెలల పాటు తిరిగితే కానీ..వాళ్లు ఆ ఫిర్యాదుని తీసుకోలేదు. ఇదంతా జరిగి నాలుగేళ్లు దాటింది. 2018లో అక్టోబర్ 28న గువాహటిలోని గలేరియా మాల్‌లో జరిగిందీ ఘటన. ఇన్నేళ్లకు కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రూ.67,000 ఫైన్ కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. థియేటర్‌ని క్లీన్‌గా ఉంచడం యాజమాన్యం కనీస బాధ్యత అని వెల్లడించింది కన్జ్యూమర్ కోర్టు. 

Also Read: The Kerala Story: కేరళ స్టోరీ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ,కాంగ్రెస్‌కు చురకలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget