Manisha Ropeta: పాకిస్థాన్‌లో హిందూ మహిళ రికార్డు- DSPగా బాధ్యతలు!
Manisha Ropeta: పాకిస్థాన్‌లో ఓ హిందూ మహిళ చరిత్ర సృష్టించారు. డీఎస్‌పీగా బాధ్యతలు చేపట్టారు.
Manisha Ropeta: పాకిస్థాన్‌లో ఓ హిందూ మహిళ చరిత్ర సృష్టించారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని రికార్డులు బ్రేక్ చేశారు. ఈ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా నిలిచారు.
ఇదే రికార్డు
పాకిస్థాన్‌కు చెందిన హిందూ మహిళ మనీషా రోపేటా (26) పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) పదవిని సాధించారు. ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో మనీషా నిలిచారు. మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.
For the first time in Sindh police's history, a Hindu woman will joined the force as a high rank officer.
— SIDDHI KUMARI (@kumari_siddhi01) July 26, 2022
Manisha Ropeta, 26, has become the first Hindu woman to be appointed DSP in the Sindh police after passing the Sindh Public Service Commission exam.. pic.twitter.com/7ixxAz25KX
ఇలా సాధించారు
సింధ్ రాష్ట్రం జకోబాబాద్‌కు చెందిన మనీషా.. మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించారు. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు.
Also Read: Rashtrapatni Remark Row: కాంగ్రెస్ నేత అధీర్ రంజన్‌కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు