Viral Video: అన్ని మొసళ్ల మధ్యలో అలా ఎలా నడిచావ్ బాస్, నీ ధైర్యానికో దండం - వీడియో
Viral News: ఓ వ్యక్తి మొసళ్ల మధ్యలో చాలా సింపుల్‌గా వాకింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Watch Video: మొసళ్లను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఏదైనా చెరువులోకో, నదిలోకో దిగినా మొసళ్లు వస్తాయేమో అని భయపడిపోతాం. కానీ ఓ యువకుడు మాత్రం చాలా సింపుల్‌గా మొసళ్ల మధ్యలో వాకింగ్ చేస్తూ వెళ్లిపోయాడు. చుట్టూ మొసళ్లు ఉన్నాయి. వాటి మధ్యలోనే ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాడు. పైగా ఇదంతా ఓ వీడియో కూడా తీశాడు. సోషల్ మీడియాలో అలా షేర్ చేశాడో లేదో వెంటనే వైరల్ అయిపోయింది. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మొసళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్లడం చూస్తుంటే..ఆ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. (Also Read: Viral News: 5 కిలోల ఆలుగడ్డలు లంచంగా అడిగిన SI, సస్పెండ్ చేసిన అధికారులు)
Bro has 0 fear 💀 pic.twitter.com/jFlpk9cIFt
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 11, 2024
వీడియో మొదట్లో రెండు మొసళ్లు కనిపించాయి. ఏం చేస్తున్నాడో అని ఉత్కంఠగా చూస్తుంటే అక్కడ అసలు ఏమీ లేనట్టుగా వాకింగ్ చేశాడు. అందులో ఏ ఒక్క మొసలి దాడి చేసినా ఒక్క పీస్ కూడా మిగలకుండా మిగతావన్నీ చీల్చేస్తాయి. కానీ అదేమీ పట్టించుకోకుండా, ఏ భయమూ లేకుండా వెళ్లాడా యువకుడు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఈ వ్యక్తి చాలా లక్కీ అని కామెంట్ చేస్తుంటే మరి కొందరు "నువ్వు చాలా ధైర్యవంతుడివి బాస్" అని పొగుడుతున్నారు. ఇంకొందరు ఈ వీడియో చూస్తున్నంత సేపూ వణకిపోయామని కామెంట్ చేశారు. అయితే...ఇది నిర్లక్ష్యమేనని, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని కొందరు గట్టిగానే తిడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అయిపోయింది.
Also Read: Viral Video: బుసలు కొడుతూ వచ్చి చెప్పు ఎత్తుకెళ్లిన పాము, ఏం చేసుకుంటుందో - వీడియో