Mamata Backs Sourav Ganguly: 'ఇది చాలా అన్యాయం'- దాదాకు దీదీ ఫుల్ సపోర్ట్, మోదీకి రిక్వెస్ట్!
Mamata Backs Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం చాలా అన్యాయమని బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.
Mamata Backs Sourav Ganguly: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. గంగూలీని అన్యాయంగా రేసు నుంచి తప్పించారని దీదీ అన్నారు. టీమిండియా కెప్టెన్‌గా విశేష సేవలందించిన ఆయనకు ఇలా జరగడం తనను షాక్‌కు గురి చేసిందని దీదీ అన్నారు.
Kolkata, West Bengal | On behalf of all countrymen I say that Sourav Ganguly is our pride, he has skillfully managed his sports & administration career. He was BCCI president. He was excluded in an unfair way; the compensation for it will be to send him to ICC: CM Mamata Banerjee pic.twitter.com/U25UKJ3LKQ
— ANI (@ANI) October 17, 2022
I request PM to make sure Sourav Ganguly must be allowed to contest ICC election. He's a popular figure which is why he is being deprived. Request GoI not to take a decision politically, but for cricket, sports...He is not a political party member: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/mXmqWrX2rM
— ANI (@ANI) October 17, 2022
ఎందుకు వివక్ష?
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జైషా రెండోసారి కొనసాగేందుకు కోర్టు అనుమతించిందని మమత అన్నారు. అమిత్‌షా కుమారుడైన జైషాను మాత్రం కొనసాగించి, గుంగూలీని తప్పించడానికి కారణమేంటని ప్రశ్నించారు.
ఎలా?
ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల నామినేషన్‌కు అక్టోబర్ 20 చివరితేది. ఈ పదవికి భారత్ నుంచి ఎవరైనా పోటీ చేయాలనుకుంటే బీసీసీఐ వాళ్ల పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు బీసీసీఐ, ఐసీసీలో ఎలాంటి పదవి దక్కే సూచనలు లేకపోవడతో బంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తానని గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన స్థానంలో రోజర్ బిన్నీ పేరు దాదాపు ఖరారైంది.
Also Read: Andheri East by-poll: ఆ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్న భాజపా- ఇక ఠాక్రే వర్గానిదే గెలుపు!