Maldives Fire Accident: మాల్దీవ్స్‌లో భారీ అగ్నిప్రమాదం, 9 మంది భారతీయులు మృతి!
Maldives Fire Accident: మాల్దీవుల రాజధాని మేల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Maldives Fire Accident:
మాల్దీవుల రాజధాని మేల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మైగ్రెంట్ వర్కర్స్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. 10 మంది మృతదేహాలను గుర్తించి రికవరీ చేసినట్టు చెప్పారు. ఈ బిల్డింగ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో వాహనాలను మరమ్మతు చేసే గ్యారేజ్ ఉంది. అక్కడి నుంచే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు శ్రమిస్తే గానీ మంటలు అదుపులోకి రాలేదు. మృతి చెందిన వారిలో 9 మంది భారతీయులు కాగా, మరొకరు బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియన్ హై కమిషన్ ఈ ప్రమాదంపై స్పందించింది. " మేల్‌లో జరిగిన ప్రమాదం మమ్మల్ని కలిచివేసింది. మృతి చెందిన వారిలో భారతీయులూ ఉన్నారు. మాల్దీవియన్ అధికారులతో మేము ఎప్పటి కప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నాం" అని ట్వీట్ చేసింది. సమీపంలోని స్టేడియంలో ఓ ఎవాక్యుయేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి...బిల్డింగ్‌లో ఉన్న వారిని అక్కడికి సురక్షితంగా తరలిస్తున్నట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు స్పష్టం చేశారు.
Nine people died due to the fire happened in the 'M. Niru Fehi' located on Maaveyo Magu in the center of Male' city, Maldives. pic.twitter.com/u0CPr7rSqn
— Zidhan Riyaz (@liyaakujjaa) November 10, 2022
Correction and update: 10 people died due to the fire happened in the 'M. Niru Fehi' located on Koaru Ken'di Magu in the Male' city, Maldives. https://t.co/sWpygz01dk pic.twitter.com/kO7Sfs7wV4
— Zidhan Riyaz (@liyaakujjaa) November 10, 2022
We are deeply saddened by the tragic fire incident in Malé which has caused loss of lives, including reportedly of Indian nationals.
— India in Maldives (@HCIMaldives) November 10, 2022
We are in close contact with the Maldivian authorities.
For any assistance, HCI can be reached on following numbers:
+9607361452 ; +9607790701