Maha Kumbh 2025 : మహా కుంభమేళా 2025 వెబ్ సైట్ రికార్డ్ - 183 దేశాల నుండి వీక్షించిన 33 లక్షల మంది
Maha Kumbh 2025 : మహా కుంభమేళా 2025కు సమయం సమీపిస్తున్న కొద్దీ ఉత్సవాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
Maha Kumbh 2025 : హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా 2025 మరో 6రోజుల్లో ప్రారంభం కానుంది. ఇది జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సందర్భంగా ఈ మహా వేడుక గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. పలు వెబ్ సైట్స్, పోర్టల్స్ ద్వారా ఈ గ్రాండ్ ఈవెంట్ గురించిన సమాచారాన్ని చురుకుగా తెలుసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం కోసం మహా కుంభమేళా 2025 అధికారిక వెబ్ సైట్ https://kumbh.gov.in/ ను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా ఈ వెబ్ సైట్ ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. వెబ్‌సైట్ డేటా ప్రకారం, జనవరి 4 నాటికి, 183 దేశాల నుండి 33 లక్షల మంది సందర్శకులు మహాకుంబ్ గురించి వివరాలను సేకరించడానికి పోర్టల్‌ను యాక్సెస్ చేశారు.
ఈవెంట్ కు సంబంధించిన సమాచారం కోసం వెబ్ సైట్ ను అంతర్జాతీయ స్థాయిని ప్రదర్శించే యూరప్, అమెరికా, ఆఫ్రికా వంటి ఖండాల నుంచి వీక్షించారు. జనవరి 4 నాటికి మొత్తం 33 లక్షల 5వేల 667 మంది యూజర్లు అధికారిక మహాకుంభ్ పోర్టల్‌ను సందర్శించారని వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న సాంకేతిక బృందం ప్రతినిధి ధృవీకరించారు. ఈ యూజర్లు 183 దేశాలకు చెందినవారని, ప్రపంచవ్యాప్తంగా 6,206 నగరాల నుండి విజిటింగ్స్ నమోదు చేశాయన్నారు.
Maha Kumbh website visited by over 33 lakh people from India, 182 other countries
— ANI Digital (@ani_digital) January 6, 2025
Read @ANI Story | https://t.co/QMnMcYbyuV#Mahakumbh #33lakhpeople #Mahakumbhwebsite pic.twitter.com/OqtoWGulc7
వెబ్ సైట్ విజిటింగ్ లో భారత్ టాప్
యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, కెనడా, జర్మనీ నుండి గణనీయమైన ట్రాఫిక్‌తో, వెబ్‌సైట్ సందర్శించారు. ఇందులో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. సందర్శకులు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడమే కాకుండా దాని కంటెంట్‌ను అన్వేషించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చించారు. వెబ్‌సైట్ ప్రారంభించినప్పటి నుంచి ఈ ట్రాఫిక్‌లో నమోదైన గణనీయమైన పెరుగుదలను సాంకేతిక బృందం గుర్తించింది. ఈవెంట్ దగ్గరికి వస్తున్న కొద్దీ రోజువారీ యూజర్ల సంఖ్య మిలియన్‌లకు చేరుకుంది.
డిజిటల్ మహా కుంభమేళా
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం మహా కుంభమేళాను డిజిటల్ మహాకుంభ్‌గా ప్రదర్శిస్తోంది. భక్తుల సౌకర్యార్థం అనేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 6 అక్టోబర్ 2024న ప్రయాగ్‌రాజ్‌లో సీఎం యోగి ప్రారంభించిన మహాకుంభ అధికారిక వెబ్‌సైట్ కూడా ఉంది. ఈ వెబ్ సైట్ మహా కుంభమేళాకు సంబంధించిన సమాచారాన్ని సవివరంగా పొందుపర్చారు. దీని వల్ల భక్తులు, ఇతరులు కావల్సిన సమాచారాన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అంతే కాకుండా ఈవెంట్ సమయంలో ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, స్నానోత్సవాలు వంటి వివరాలనూ ఇందులో సమకూర్చారు. మహాకుంభమేళా గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ డిజిటల్ చొరవ లక్ష్యంగా పెట్టుకుంది.