![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ఓ బాత్రూమ్ అంత ఇంటికి రూ.2 లక్షల అద్దె, ఇదేందయ్యా ఇది - వైరల్ వీడియో
Viral Video: లండన్‌లో ఓ మహిళ ఫ్లాట్‌ని రూ.2 లక్షలకు అద్దెకి తీసుకుంది.
![ఓ బాత్రూమ్ అంత ఇంటికి రూ.2 లక్షల అద్దె, ఇదేందయ్యా ఇది - వైరల్ వీడియో London Woman Gives Tour Of Her Small Flat In London With Rs 2 Lakh Rent ఓ బాత్రూమ్ అంత ఇంటికి రూ.2 లక్షల అద్దె, ఇదేందయ్యా ఇది - వైరల్ వీడియో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/0a73e38e6464f767a8d961cbb0aa6be11712753519328517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
London Housing: ఓ ఇల్లు రెంట్‌కి తీసుకునేప్పుడు చాలా మంది తక్కువ అద్దెలో పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటారు. కానీ ఆ కోరిక అంత ఈజీగా తీరదు. కాస్తంత స్పేస్‌కే ఎవరూ ఊహించనంత రెంట్ కట్టాల్సి వస్తుంది. లండన్‌లో ఓ మహిళ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె ఉంటున్న చిన్న ఫ్లాట్‌ని వీడియో తీసి పెట్టింది. ఓ మినీ బాత్రూమ్, ఓ రూమ్ ఉన్న ఇంటికి ఆమె నెలకి రూ.2 లక్షల రెంట్ కడుతోందట. సెంట్రల్ లండన్‌లో ఉంది ఈ ఇల్లు. ప్రస్తుతం ఈ వీడియోని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. "ఇందులో ఏముందని అంత రెంట్" అని ఆశ్చర్యపోతున్నారు. అంత చిన్న ఇంట్లో కిచెన్, బాత్రూమ్, షెల్ఫ్‌లు, బాల్కనీ కట్టారు. కానీ ఫ్లాట్ మాత్రం మన ఇంట్లో ఓ బాత్రూమ్ అంత ఉంది. అసలు ఈ ఇంటికి అంత వాల్యూ ఉందా..? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫ్లాట్‌లో తాను ఎలా ఉంటుందో వివరిస్తూ వీడియో పోస్ట్ చేసింది ఆ మహిళ. అందులోనే ఓ బెడ్, వాల్‌మౌంటెడ్ టీవీ ఉన్నాయి. మినియేచర్ బాత్రూమ్నీ చూపించింది. ఈ స్పేస్‌కి తాను 1,850 పౌండ్లు కడుతోంది. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.2 లక్షలు. లండన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలా ఉంటుందా అని షాక్ అవుతున్నారంతా. డబ్బులు ఎక్కువగా ఉంటే నైజీరియా వెళ్లిపోయి సెటిల్ అవ్వండి అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
London resident gives a tour of his £1850 per month apartment
— Instablog9ja (@instablog9ja) April 6, 2024
pic.twitter.com/gzskZanmZw
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)