Lok Sabha Election Results 2024: లీడ్‌లో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, ఆధిక్యంలో మరి కొందరు సినీ ప్రముఖులు
Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ ప్రముఖులు పలు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Election Results 2024: దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఈ సారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. వీళ్లలో కంగనా రనౌత్, హేమ మాలిని, మనోజ్ తివారి సహా మరికొందరున్నారు. ప్రస్తుత ఫలితాల ట్రెండ్‌ని బట్టి చూస్తే హిమాచల్ ప్రదేశ్‌లో మండి నియోజకవర్గంలో బరిలోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ వెనకంజలో ఉన్నారు. ఇక భోజ్‌పురి నటుడు, నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మనోజ్ తివారి లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున కన్హయ్య కుమార్ పోటీ చేశారు. వెస్ట్‌బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో బరిలో ఉన్న తృణమూల్ అభ్యర్థి, నటుడు శత్రఘ్ను సిన్హా ఆధిక్యంలో ఉన్నారు. గతంలో కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. ఇక మధురలో బీజేపీ అభ్యర్థి హేమ మాలిని దూసుకుపోతున్నారు. 2019లో ఆమె విజయం సాధించారు. యూపీలోని మీరట్‌లో బీజేపీ తరపున బరిలో దిగిన హిందీ సీరియల్ రామాయణ్ నటుడు అరుణో గోవిల్ లీడ్‌లో ఉన్నారు. భోజ్‌పురి యాక్టర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి రవి కిషన్ గోరఖ్‌పూర్‌లో దూసుకుపోతున్నారు. మలయాళ నటుడు సురేష్ గోపి త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రస్తుత ట్రెండ్ ఆధారంగా చూస్తే ఆయనే అక్కడ లీడ్‌లో ఉన్నారు.