Lata Mangeshkar Last Rites: దివికేగిన అమృత గానం.. లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తి.. మోదీ కన్నీటి వీడ్కోలు
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సహా ప్రముఖులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.
గాయని లతా మంగేష్కర్ భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ముంబయిలోని శివాజీ పార్కులో ఆమె పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, క్రికెటర్ సచిన్ దంపతులు, పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర కేబినెట్ మంత్రులు.. లతా మంగేష్కర్‌కు తుది వీడ్కోలు పలికారు.
#WATCH | Prime Minister Narendra Modi attends state funeral of veteran singer Lata Mangeshkar https://t.co/6nEuiFXXXo
— ANI (@ANI) February 6, 2022
#WATCH | Cricketer Sachin Tendulkar and actor Shah Rukh Khan pay last respect to veteran singer Lata Mangeshkar at Mumbai's Shivaji Park pic.twitter.com/r22Njpi4XW
— ANI (@ANI) February 6, 2022
జన సంద్రం..
ఆమె నివాసం నుంచి మొదలైన లతా మంగేష్కర్ అంతిమయాత్రకు అభిమానులు తరలివచ్చారు. అంతిమయాత్ర శివాజీ పార్కుకు చేరుకునే వరకు ఆ దారి అంతా జనసంద్రాన్ని తలపించింది. సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్కులో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు ఆమె పార్థివ దేహానికి గౌరవ వందనం సమర్పించారు. అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది.
పోరాడి..
భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడిన ఆమె జనవరి 8న ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించిన క్రమంలో కొద్ది రోజులకు కోలుకున్నారు. అయితే.. శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవటం వల్ల 28 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆమె సోదరి ఉషా మంగేష్కర్ వెల్లడించారు.
లతా మంగేష్కర్ మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన ప్రముఖులే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రధానులు, అధ్యక్షులు కూడా ఆమె మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Also Read: Lata Mangeshkar Passes Away: లతా జీ.. మీరే దూరమయ్యారు, కానీ ఆ స్వరం కాదు: నేపాల్ అధ్యక్షురాలు
Also Read: Lata Mangeshker: లతా మంగేష్కర్‌కు చెల్లి చేతి వంటంటే ప్రాణం, ఇష్టంగా వండించుకుని తినే వంటలివే