Lata Mangeshkar Passes Away: లతా జీ.. మీరే దూరమయ్యారు, కానీ ఆ స్వరం కాదు: నేపాల్ అధ్యక్షురాలు
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పంట్ల నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవీ భండారీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవీ భండారీ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖుల సంతాపం..
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా లతా మంగేష్కర్‌కు నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల బంగ్లాదేశ్ సంతాపం వ్యక్తం చేస్తుందన్నారు.
గాయని లతా మంగేష్కర్‌కు సంతాపం ప్రకటించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. 'భారత రత్న, లతా జీ సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి' అని ట్వీట్ చేశారు.
లతా మంగేష్కర్ మరణం తనను శోకసంద్రంలోకి నెట్టిందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అనేక దశాబ్దాలుగా తన మధుర స్వరాలతో సంగీత ప్రియులను అలరించారని పేర్కొన్నారు. ఆమె మరణంతో దేశం గొంతు మూగబోయిందని ట్వీట్ చేశారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు తీర్చలేనిదన్నారు,
లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
తుదిశ్వాస..
భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడిన ఆమె జనవరి 8న ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించిన క్రమంలో కొద్ది రోజులకు కోలుకున్నారు. అయితే.. శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవటం వల్ల 28 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆమె సోదరి ఉషా మంగేష్కర్ వెల్లడించారు.
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల సహా భాజపా కార్యక్రమాలు రద్దు.. ఇదే కారణం
Also Read: Asaduddin Owaisi Attack: 'మీరు ఒక్క ఓవైసీని చంపితే లక్షలాది మంది ఓవైసీలు పుడతారు'