Kuno National Park Cheetah: నమీబియా చీతాల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, వాటి ఆరోగ్యాన్ని కాపాడేందుకే
Kuno National Park Cheetah: కునో నేషనల్ పార్క్‌లోని చీతాలను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.
Kuno National Park Cheetah:
సంరక్షణా బాధ్యతలు..
నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో సంరక్షిస్తున్నారు. వీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలే చేపడుతోంది కేంద్రం. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఓ టాస్క్‌ఫోర్స్‌ని నియమించింది. చీతాలను సరైన విధంగా సంరక్షించుకునే బాధ్యతల్ని...ఈ టాస్క్‌ఫోర్స్ తీసుకోనుంది. చీతాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, క్వారంటైన్‌లో ఎలా ఉంటున్నాయో పరిశీలించడం, చీతాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించటం లాంటివి చేయనున్నారు.
Cheetah introduction in India, Ministry of Environment, Forest and Climate Change constitutes a 9-member task force for monitoring Cheetah introduction in Kuno National Park, Madhya Pradesh and other suitable designated areas. pic.twitter.com/g0OAESRcHU
— ANI (@ANI) October 7, 2022
టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయటమే కాదు. చీతాల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతోంది కేంద్రం. వేటగాళ్ల నుంచి వీటికి రక్షణ కల్పించేందుకు... ప్రత్యేక శిక్షణ తీసుకున్న జర్మన్ షెపర్డ్స్ కుక్కల్ని కాపలాగా ఉంచనున్నారు. ప్రస్తుతం వీటికి ఇండో టిబెటన్ బార్డర్ వద్ద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కునో నేషనల్ పార్క్‌లో...చీతాలున్న చోట ఇవి కాపలా కాస్తాయి. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. పులి చర్మం, ఎముకలతో పాటు ఏనుగు తొండాన్నీ గుర్తించే విధంగా వాటికి శిక్షణ ఇస్తున్నారు. WWWF-India (World Wide Fund for Nature India) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది. ITBPలోని బేసిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ శునకాలను ట్రైన్ చేస్తున్నారు. దాదాపు 7 నెలల శిక్షణ తరవాత ఇవి కాపలాకు సిద్ధమవుతాయి. పసిగట్టడం, ట్రాక్ చేయటం లాంటి నైపుణ్యాల్లో అవి ఆరితేరాకే క్షేత్రస్థాయిలోకి పంపుతారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటి డ్యూటీ మొదలవుతుంది.
దశాబ్దాల తరవాత భారత్‌కు..
దాదాపు 7 దశాబ్దాల తరవాత చీతాలు భారత్‌కు తిరిగి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వాటిని అధికారికంగా వదిలారు. వాటిని సంరక్షించి అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మొదటి విజయం. రీఇంట్రడక్షన్ ఆఫ్ యానిమల్స్ (Reintroduction of Animals)లో భాగంగా భారత్ ఇలా చీతాలను నమీబియా నుంచి తెప్పించింది. 1930ల్లో చీతాలను వేటాడటం ఓ స్టేటస్ సింబల్‌గా భావించేవారు. అందుకే...లేదంటే వాటిని పెంచుకుని వాటితో వేరే జంతువులను వేటాడించేవారు. మనం కుక్కల్ని పెంచుకున్నట్టుగా... అప్పట్లో చీతాలను పెంచుకునే వారు. నిజానికి...చీతాలకు, మనుషులకు మధ్య కాన్‌ఫ్లిక్ట్ చాలా తక్కువగా ఉండేదట. చాలా మంది వాటిని "Hunting leopards" గా పిలిచేవారు. వేట కోసం వీటిని ఎక్కువగా వినియోగించేవారు. చీతాలు మాత్రమే కాదు. కాస్త ప్రత్యేకం అనిపించే జంతువులన్నింటినీ అప్పటి రాజులు, బ్రిటీషర్లు వేటాడేవారు. అదిగో అలా మొదలైన వేట..క్రమంగా చీతాల సంఖ్యపై ప్రభావం చూపింది. అవి కనుమరుగవుతూ వచ్చాయి. 1939నుంచి ఇది మరీ ఎక్కువైంది. 1972లో Wildlife Protection Act వచ్చేంత వరకూ ఈ వేట అలాగే సాగింది. అంటే...దాదాపు 40 ఏళ్లపాటు వాటిని వేటాడారు.
Also Read: రద్దయిన పాత నోట్లను కొత్తగా మార్చే స్వామిజీ!