Krithi Shetty As Whistle Mahalaxmi: 'ది వారియర్'లో విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి! ఇదిగో ఫస్ట్ లుక్

'ది వారియర్'లో రామ్ పోతినేనికి జంటగా కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దానిని మీరూ చూడండి.

FOLLOW US: 

'ఉప్పెన'లో బేబమ్మ... 'బంగార్రాజు'లో సర్పంచ్ నాగలక్ష్మి... సినిమాల్లో కృతి శెట్టి (Krithi Shetty) క్యారెక్టర్ల పేర్లు కూడా భలే అందంగా ఉంటాయి. ఇప్పుడు రామ్ సినిమాలో ఆమె క్యారెక్టర్‌కు భలే పేరు పెట్టారు. ఈసారి 'విజిల్ మహాలక్ష్మి'గా కృతి శెట్టి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ది వారియర్' (The Warriorr). తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి లింగుస్వామి దర్శకుడు. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె (Krithi Shetty First Look In The Warriorr) ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విజిల్ మహాలక్ష్మి పాత్రలో (Krithi Shetty As Whistle Mahalaxmi) నటిస్తున్న తెలిపారు. ఫ‌స్ట్ లుక్‌లో జీన్స్, టీ - షర్ట్ వేసుకుని కూల్‌గా స్కూటర్ నడుపుతూ కృతి శెట్టి కనిపించారు.

"విజిల్ మహాలక్ష్మి క‌ర్నూల్‌లో ఆర్జే. అక్కడ ఆమె చాలా ఫేమస్. ఆ అమ్మాయి చేసే ప్రోగ్రామ్స్‌కు ఫ్యాన్స్ ఎంతోమంది. మరి... పోలీస్‌కు, ఆర్జేకు ఎక్కడ కుదిరింది? ఎలా ప్రేమలో పడ్డారు? అనేది సినిమాలో చూడాలి. సినిమాలో యాక్ష‌న్‌తో పాటు ప్రేమకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. రామ్, కృతి శెట్టి మధ్య లవ్ సీన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా... విజిల్ మహాలక్ష్మిగా కృతి పాత్ర ప్రేక్షకులందరూ ఇష్టపడేలా ఉంటుంది. వీళ్లిద్దరి జోడీ చూడముచ్చటగా ఉంది" అని దర్శకుడు లింగుస్వామి చెప్పారు. ఆల్రెడీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా విడుదలైన రామ్ లుక్‌కు వస్తున్న తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. "సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్... విల‌న్స్‌తో యాక్షన్ సీన్స్ ఎక్ట్స్రాడిన‌రీగా వస్తున్నాయి. రామ్ నటన అద్భుతం. దేవి శ్రీ ప్రసాద్ సూపర్ సాంగ్స్ ఇస్తున్నారు" అని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు.

Also Read: 'ఎల్లమ్మా' - పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో కొత్త పాట! పాడింది ఎవరో తెలుసా?

ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా, అక్షరా గౌడ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, యాక్షన్: అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్.

Also Read: బాక్సాఫీస్ బరిలో 'ఆచార్య' - 'ఎఫ్ 3' మధ్య క్లాష్ తప్పింది! ఓ నెల వెనక్కి వెళ్ళిన వెంకటేష్ - వరుణ్ తేజ్ సినిమా

Published at : 14 Feb 2022 11:21 AM (IST) Tags: Krithi Shetty The Warriorr Movie Krithi Shetty As Whistle Mahalaxmi Krithi Shetty First Look The Warriorr Krithi Shetty As RJ Whistle Mahalaxmi In The Warriorr Krithi Shetty Role In The Warriorr Unveiled

సంబంధిత కథనాలు

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్

Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్

Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్

Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్

Secunderabad Bjp Meeting : బీజేపీ విజయసంకల్ప సభ, భారీగా తరలివచ్చిన శ్రేణులు, హాజరైన ప్రజాగాయకుడు గద్దర్

Secunderabad Bjp Meeting : బీజేపీ విజయసంకల్ప సభ, భారీగా తరలివచ్చిన శ్రేణులు, హాజరైన ప్రజాగాయకుడు గద్దర్

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

టాప్ స్టోరీస్

IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్‌లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!

IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్‌లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?

Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?

Amit Shah: కేసీఆర్‌కి ఉన్న బాధల్లా ఒక్కటే, తన కొడుకుని సీఎం చేయాలని-అమిత్‌షా సెటైర్లు

Amit Shah: కేసీఆర్‌కి ఉన్న బాధల్లా ఒక్కటే, తన కొడుకుని సీఎం చేయాలని-అమిత్‌షా సెటైర్లు