X

Kozhikode Plane Crash: 'ఎన్ని చూడలేదు.. ఇదో లెక్కా! అన్న పైలెట్ ఆలోచనే ప్రమాదానికి కారణం'

2020 ఆగస్టులో కోజికోడ్ లో జరిగిన విమాన ప్రమాదంపై తాజాగా నివేదిక వచ్చింది. ప్రమాదానికి పైలెట్ అస్థిర నిర్ణయాలే ప్రధాన కారణమని తెలిసింది.

FOLLOW US: 

కేరళ కోజికోడ్‌ లో గతేడాది జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రమాదానికి గల కారణాలను వివరంగా తెలిపారు. పైలెట్ ఎస్ఓపీ (స్టాండెడ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను సరిగా అమలు చేయకపోవడంతో పాటు పరికరాల మోరాయింపు కూడా ఈ ప్రమాదానికి ఓ కారణంగా నివేదికలో పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో పైలెట్‌, కో-పైలెట్‌ సహా 21 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 186 మంది ప్రయాణికులున్నారు. చాలా మందికి గాయాలతో తప్పించుకున్నారు.

పైలెట్ తప్పిదం..  • ఏఏఐబీ నివేదిక ప్రకారం, పైలెట్ తీసుకున్న అస్థిర నిర్ణయాలే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

  • విమానాన్ని టచ్‌ జోన్‌ (నేలపైకి దిగాల్సిన ప్రదేశం) దాటి సగం రన్‌వేలోకి వెళ్లి ల్యాండ్‌ చేయడం వంటి తప్పులను పైలెట్ చేశారు.

  • అంతేకాదు. 'పైలట్‌ మానిటరింగ్‌' నుంచి  'గో అరౌండ్‌'(గాల్లో చక్కర్లుకొట్టమని) చేసిన సూచనలను అమలు చేయలేకపోవడం కూడా మరో కారణం.

  • కొజీకోడ్ విమానాశ్రయంలో వాతావరణం సరిగా లేని సమయంలో ఎన్నో సార్లు విమానాన్ని ల్యాండ్ చేసిన పైలెట్ అనుభవం.. అతి ఆత్మవిశ్వాసానికి కారణమైందని నివేదిక పేర్కొంది.

Also Read: BKU Leader Rakesh Tikait: ఎండైనా, వానైనా తగ్గేదేలే.. వరద నీటిలో టికాయత్ వినూత్న నిరసన

అంచనాలో వైఫల్యం..

ఒక సారి రన్‌వే 28పై ల్యాండింగ్‌కు విఫలయత్నం చేసిన తర్వాత కూడా పైలట్‌ ఇన్‌ కమాండ్‌.. ముప్పును సరిగా అంచనా వేయలేదు. తగినంత ఇంధనం ఉన్నా వెంటనే రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. ఇది ఎస్‌ఓపీ ఉల్లంఘన కిందకు వస్తుంది.

టెయిల్‌ విండ్‌ పరిస్థితుల్లో భారీ వర్షం పడుతున్న టేబుల్‌టాప్‌ రన్‌వే పై ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించి  విమానం ప్రమాదానికి గురైంది.

Also Read: హార్ట్ ఎటాక్ vs కార్డియాక్ అరెస్ట్: గుండె జబ్బులు లేకపోయిన హృదయం ఆగుతుంది.. ఎందుకో తెలుసా?

మోరాయింపు..

పైలట్‌ ఇన్‌ కమాండ్‌ స్థానంలో కూర్చున్న వైపు ఉన్న విండ్‌ షీల్డ్‌ వైపర్‌ మొరాయించింది. తొలిసారి ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో ఆగిపోయింది. ఇది కూడా ప్రమాదానికి ఓ కారణంగా నివేదికలో పేర్కొన్నారు.

Also Read: Gujarat New CM: గుజరాత్ కొత్త సీఎం కోసం భాజపా వేట.. రేస్ లో ఆ నలుగురు

Tags: Kerala kozhikode plane crash Air India Express AAIB

సంబంధిత కథనాలు

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Breaking News Live Updates: ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

Breaking News Live Updates:  ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Huzurabad BJP : రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !

Huzurabad BJP :  రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?