News
News
X

Pulasa Fish Price: బంగారంతో పోటీపడ్డ గోదావరి లైవ్ పులస - మత్స్యకారుడు ఫుల్ హ్యాపీ

Pulasa Fish Price: ఓ మత్స్యకారుడికి దొరికిన పులస మాత్రం చాలాసేపటి వరకు ప్రాణాలతో ఉంది. దాంతో పులసను పట్టుకున్న మత్స్యకారుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

FOLLOW US: 
 
BR AMbedkar Konaseema: పులస చేపలంటే చాలు భలే గిరాకీ ఉంటుంది. పుస్తెలు అమ్మయినా సరే పులస తినాలి అని వింటుంటాం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదల సమయంలో అప్పుడప్పుడు దొరికే పులస గిరాకీనే వేరు. వేటాడే సమయంలో వలకు చిక్కిన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో పులస చనిపోతుంది. అయితే ఓ మత్స్యకారుడికి దొరికిన పులస మాత్రం చాలాసేపటి వరకు ప్రాణాలతో ఉంది. దాంతో పులసను పట్టుకున్న మత్స్యకారుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తాను ఊహించినట్లే మార్కెట్లోకి తెచ్చిన వెంటనే బతికున్న పులసను చూసి ఏకంగా 17 వేల రూపాయలు ( Pulasa Fish Price ) పెట్టి కొన్నాడు ఒక పులస ప్రియుడు.

వరదలతో తగ్గిన పులస జాడ 
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేదారిలంక‌ గోదావరిలో లైవ్ పులస దొరికింది. మాములుగా పులస వలలో పడగానే పదినిమిషాల్లో చనిపోతుంది. కాని జాలరి చందాడి సత్యనారాయణ వలలో పడ్డ పులస లైవ్ గా దొరికింది. దీంతో తన పంట పండిందనుకున్నాడు ఆ మత్స్యకారుడు. లైవ్ లో దొరికిన సుమారు కేజీ వున్న గోదావరి పులసను మామిడికుదురు మండలం పెదపట్నంలంక కు చెందిన నల్లి రాంప్రసాద్ అనే పులస ప్రియుడు ఏకంగా 17000 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడు. 
ఇదిలా వుంటే సుమారు పది ముక్కలు తెగిన ఈ పులస ఖరీదు అర గ్రాము బంగారంతో సమానమయ్యిందని కొందరు లెక్కలు కడుతున్నారు. లెక్క ఎలా వున్నా కాని ముక్క మాత్రం సూపర్ అంటున్నారు లైవ్ పులసను కొన్న రాంప్రసాద్. అందుకేనేమో పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి అన్నారు పెద్దలు. గోదావరి పులసా మజాకా.. ఇదిలా  ఉంటే లైవ్ పులస దొరకడం చాలా అరుదు అని మత్స్యకారులు చెబుతున్నారు.

రూ. 23 వేలు పలికిన పులస 
గోదావరి జిల్లాల్లో పులస చేపకు మామూలు క్రేజ్ ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే జాలర్లు, భోజన ప్రియులు పులస కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. పులస చేపల పులుసు ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి ఈ చేపలకు మార్కెట్ లో  భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే పులస దొరకగానే వాటిని సొంతం చేసుకునేందుకు భోజన ప్రియులు బారులు తీరుతారు. యానాం మార్కెట్లో ఇటీవల రెండు కిలోల బరువున్న పులస రూ.19 వేల ధర పలికింది. తాజాగా మరో పులస జాలర్లకు చిక్కింది. దీని ధర మరింత ఎక్కు పలికింది. రెండు కిలోల బరువున్న పులస చేప ఆగస్టు 28 న యానాం రాజీవ్‌ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద అమ్మకానికి పెట్టారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ.22 వేలకు కొనుగోలు చేసింది. అనంతరం దానిని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేలకు కొనుగోలు చేశారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేప గోదావరిలో వరద నీటికి ఎదురీదుతుంది.  

సముద్రంలో ఉప్పు నీటిని తాగే ఈ పులస చేప, గోదావరి నదిలోకి ప్రవేశించగానే మంచి నీటిని తీసుకుంటుంది. అందుకే వీటి రుచి సైతం ప్రత్యేకంగా ఉంటుందని తినేవారు చెబుతారు. ఇటీవల యానాం మార్కెట్లోనూ రూ.22 వేలకు పులస చేపను ఖరీదు చేశారు. రెండు రోజుల కిందట సైతం దాదాపు ఇరవై వేలకు పులస కొనుగోలు చేశారు పులస ప్రియులు.

News Reels

Published at : 11 Oct 2022 11:36 AM (IST) Tags: pulasa fish pulasa Konaseema District BR Ambedkar Konaseema

సంబంధిత కథనాలు

సీబీఐ కేసుల్లో ఏపీ ప్రజాప్రతినిధులే టాప్- ఏపీలో 10 మందిపై నేరారోపణలు!

సీబీఐ కేసుల్లో ఏపీ ప్రజాప్రతినిధులే టాప్- ఏపీలో 10 మందిపై నేరారోపణలు!

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Gold-Silver Price 08 December 2022: మళ్లీ ₹54 వేలకు చేరిన బంగారం ధర, పెళ్లిళ్ల ఎఫెక్ట్‌ మామూలుగా లేదు

Gold-Silver Price 08 December 2022: మళ్లీ ₹54 వేలకు చేరిన బంగారం ధర, పెళ్లిళ్ల ఎఫెక్ట్‌ మామూలుగా లేదు

Petrol-Diesel Price, 08 December 2022: అనంతపురం, ఆదిలాబాద్‌లో భారీగా పెరిగిన చమురు ధర, మిగిలిన ప్రాంతాల్లోనూ మోతెక్కిపోతోంది

Petrol-Diesel Price, 08 December 2022: అనంతపురం, ఆదిలాబాద్‌లో భారీగా పెరిగిన చమురు ధర, మిగిలిన ప్రాంతాల్లోనూ మోతెక్కిపోతోంది

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

టాప్ స్టోరీస్

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ - ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ -  ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?