Jammu Kashmir Result : జమ్మూలో దున్నేసినా కశ్మీర్‌లో తేలిపోయిన బీజేపీ - అందుకే తిరగబడిన ఫలితం !
Elections 2024 : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కిషన్ రెడ్డి , రామ్‌మాధవ్‌లకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. వారే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రానికి ఇంచార్జులుగా పని చేశారు.
Kishan Reddy and Rammadhav : జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలి సారి ఎన్నికను నిర్వహించారు. ఇంకాపూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వనప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆర్టికల్ 370 రద్దును ప్రజలు ఆమోదించాలని దానికి తమ విజయమే సాక్ష్యం అవుతుందని బీజేపీ అనుకుంది. అక్కడ విజయం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు గతంలో జమ్మూ కశ్మీర్‌కు ఇంచార్జ్ గా పని చేసి ప్రస్తుతం ఆరెస్సెస్‌కు వెళ్లిపోయిన రామ్ మాధవ్‌ను కూడా మళ్లీ వెనక్కి పిలిపించి కశ్మీర్ బాధ్యతలు ఇచ్చారు. వారు తమ శాయశక్తులా కృషి చేసినా ప్రయోజనం లేకపోయింది.
బీజేపీ విజయం సాధిస్తుందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు కానీ ఎవరికీ మెజార్టీ రాదని అంచనా వేశారు. అయితే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అనూహ్యంగా పూర్తి మెజార్టీని సాధించింది. సాధారణ మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధింంచడంతో పాటు ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కానీ అది అసాధ్యమని బీజేపీ వాదించింది. అక్కడ ఉన్న వివిధ రకాల కారణఆలు, బీజేపీపై ఉన్న హిందూ ముద్ర కారణంగా ఆ పార్టీ పాతిక సీట్ల వద్దనే ఆగిపోవాల్సి వచ్చింది. పీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం కూడా బీజేపీకి మైనస్ గా మారింది. ఆ పార్టీ మరిన్న ిఓట్లలుు చీల్చినట్లయితే నేషనల్ కాన్ఫరెన్స్ నష్టపోయేది. కానీ ఒమర్ అబ్దుల్లా అలాంటి పరిస్థితి రానీయలేదు.
బీహార్ , మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అసలు రాజకీయం - బీజేపీ బలహీనపడుతుందా ?
కశ్మీర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన కూడా ఓడిపోయారు. జమ్మూ ప్రాంతంలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించింది. జమ్మూలో ఉన్న 43 సీట్లలో బీజేపీ 26 స్థానాలు గెలుచుకgxof. కeనీ కాశ్మీర్ లోయలోని 47 స్థానాల్లో మాత్రం బీజేపీ ఖతా తెరవలేదు. లోక్‌సభ ఎన్నికల్లో లోయలోని మూడు పార్లమెంట్ సెగ్మెంట్లకు బీజేపీ పోటీ కూడా చేయలేదు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ఆటంకం అని ఒప్పించడంలో బీజేపీ విఫలమైందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో చాలా రోజుల పాటు ఈ ప్రాంతంలో ఆంక్షలు విధించడం కూడా ప్రజల్లో కోపాన్ని నింపిందని అందులో లోయలో బీజేపీకి ఓట్లు వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని విశ్లేషిస్తున్నారు.
కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు ఆర్టికల్ 370 రద్దుని తమకు జరిగిన అన్యాయంగా ప్రచారం చేశాయి. దీనిని బీజేపీ బలంగా కౌంటర్ చేయలేకపోయింది. తీవ్రవాదం, వేర్పాటువాదం, రాళ్లదాడులు తగ్గినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడి స్థానిక విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని బీజేపీ హామీ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగినప్పటికీ, కశ్మీర్ లోయలోని ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోవడం వల్ల బీజేపీకి ఆశించిన విజయం దక్కలేదు.