Kim Jong Un's Daughter: బడికెళ్లాల్సిన వయసులో మిజైల్ టెస్ట్‌లు, కిమ్ కూతురు సెన్సేషన్
Kim Jong Un's Daughter: మిజైల్ టెస్ట్‌లలో కిమ్‌తో పాటు ఆయన కూతురు కూడా తరచూ కనిపిస్తోంది.
![Kim Jong Un's Daughter: బడికెళ్లాల్సిన వయసులో మిజైల్ టెస్ట్‌లు, కిమ్ కూతురు సెన్సేషన్ Kim Jong Un's Daughter Becomes Fixture In N. Korea Weapons Tests Kim Jong Un's Daughter: బడికెళ్లాల్సిన వయసులో మిజైల్ టెస్ట్‌లు, కిమ్ కూతురు సెన్సేషన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/15/6e110e645c8978f25bf6b4d5df122e3d1681553493809517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kim Jong Un's Daughter Missile Test:
మిజైల్ టెస్ట్‌ల్లో కిమ్ కూతురు
నార్త్ కొరియాలో పిల్లలందరూ స్కూళ్లకు వెళ్లి బుద్ధిగా చదువుకుంటున్నారు. ఒక్క అమ్మాయి తప్ప. ఆ అమ్మాయి మరెవరో కాదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూతురు. చాలా రోజుల పాటు ఆమె బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు కిమ్. గతేడాది ఓ సారి కూతురితో పాటు కనిపించాడు. ఇంటర్నేషనల్ మీడియా అంతా ఆ ఫోటోలను ప్రచురించింది. ఈమే కిమ్ కూతురు అంటూ పరిచయం చేసింది. అప్పటి నుంచి తరచూ నాన్నతో కలిసి కనిపిస్తూనే ఉంది ఆ అమ్మాయి. స్కూల్‌కెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి...నాన్నతో పాటు పక్కనే ఉండి కొత్త మిజైల్ టెస్ట్‌ను దగ్గరుండి చూసుకుంటోంది. ఆమె వయసెంత..? ఈ అమ్మాయి కాకుండా కిమ్‌కి ఇంకెవరైనా పిల్లలున్నారా..? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీయే. కానీ...ఈ అమ్మాయి మాత్రం రెగ్యులర్‌గా కిమ్‌తో కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. "ప్రీషియస్ చైల్డ్, రెస్పెక్టెడ్ డాటర్" అనే క్యాప్షన్‌లతో నార్త్ కొరియా మీడియా ఈ ఫోటోలు ప్రచురించింది. సౌత్ కొరియా స్పై ఏజెన్సీ చెబుతున్న వివరాల ప్రకారం ఆ అమ్మాయి పేరు జూయే. పదేళ్ల వయసు ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో, కర్లీ హెయిర్‌తో నాన్న పక్కనే నిలుచుని ఉంది. కిమ్ చేతిలో సిగరెట్ కనిపిస్తోంది. ఇద్దరూ నిలబడి మిజైల్ టెస్ట్‌ని చాలా తీక్షణంగా చూస్తున్నారు ఈ ఫోటోల్లో. ఇలాంటి మిజైల్ టెస్ట్‌ల్లో కిమ్ కూతురు కనిపించడం ఇది మూడోసారి. మిలిటరీ అంతా ఆమెను చీఫ్ గెస్ట్‌లా చూస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది. గతేడాది నవంబర్‌లో ICBM లాంఛింగ్ ఈవెంట్‌లో నాన్న చేయి పట్టుకుని కనిపించింది జూయే. ఆ ఫోటో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది.
🇰🇵 🚀 North Korea tested its new intercontinental ballistic missile Hwasong-18 for the first time yesterday. The launch was attended by the country's leader, Kim Jong Un, along with his daughter, wife and sister.
— Djole 🇷🇸 (@onlydjole) April 14, 2023
👇 pic.twitter.com/ZlnbKI36hQ
సౌత్, నార్త్ కొరియా వార్..
దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య రోజురోజుకీ ఘర్షణలు పెరుగుతున్నాయి. ఉత్తర కొరియా పదేపదే మిజైల్ టెస్టింగ్ చేస్తూ కవ్విస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదంటూ ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా...దక్షిణ కొరియాను ఇంకా టెన్షన్ పెడుతోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. ఫోన్ కాల్ ద్వారా సంప్రదించాలని చూస్తోంది. ఇటు నార్త్ కొరియా మాత్రం అక్కడి నుంచి ఏ కాల్‌ను కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. మిలిటరీ కాన్ఫ్లిక్ట్పై చర్చించేందుకు ఎన్ని సార్లు డయల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయడం లేదని దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించింది. ఈ కారణంగా...ఆందోళనలు మరింత పెరిగాయి. కావాలనే ఉత్తర కొరియా ఇలా చేస్తోందా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. Yonhap న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం...దక్షిణ కొరియా రెండు మూడు సార్లు కాల్ చేసినా...అటు నుంచి స్పందన రాలేదు. ఇదే విషయాన్ని సౌత్ కొరియా మంత్రి వెల్లడించారు.
"నార్త్ కొరియా మా ఫోన్ కాల్స్‌ని రిసీవ్ చేయడం లేదు. ఓ సారి సాయంత్రం 5 గంటలకు కాల్ చేశాం. ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు మరోసారి కాల్ చేశాం. అయినా ఆన్సర్ లేదు. సాధారణంగా ఈ ఫోన్ కాల్స్‌తో దౌత్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు. లాజిస్టిక్స్ పరమైన సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. ఇదెప్పుడూ జరిగేదే. కానీ ఈ సారి మాత్రం కిమ్ కాల్ లిఫ్ట్ చేయం లేదు"
- సౌత్ కొరియా మంత్రి
Also Read: Lucky Draw Jackpot: అదృష్టం అంటే నీదే బ్రో, లక్కీ డ్రాలో 365 రోజుల పెయిడ్ లీవ్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)