Lucky Draw Jackpot: అదృష్టం అంటే నీదే బ్రో, లక్కీ డ్రాలో 365 రోజుల పెయిడ్ లీవ్స్
Lucky Draw Jackpot: చైనాలోని ఓ కంపెనీ లక్కీ డ్రాలో ఓ ఉద్యోగికి 365 రోజుల పెయిడ్ లీవ్స్ వచ్చాయి.
Lucky Draw Jackpot:
లక్కీ డ్రాలో పెయిడ్ లీవ్స్
కంపెనీ జస్ట్ ఓ టీమ్ లంచ్‌కి తీసుకెళ్తేనే గొప్పగా చెప్పుకుంటాం. ఇక రిసార్ట్‌కో, టూర్‌కో ప్లాన్ చేస్తే ఫిదా అయిపోతాం. పని ఎంతున్నా పట్టించుకోం. ఇక అప్పుడప్పుడు చిన్న చిన్న కంటెస్ట్‌లు పెట్టి ఎంప్లాయిస్‌కి స్ట్రెస్ తగ్గిస్తూ ఉంటాయి కొన్ని కంపెనీలు. అందులో చిన్న గిఫ్ట్ వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ చైనాలోని ఓ ఉద్యోగికి బంపర్ ఆఫర్ వచ్చింది. డిన్నర్ పార్టీలో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. 365 రోజుల పెయిడ్ లీవ్స్‌ని గ్రాంట్ చేస్తూ ఓ పెద్ద చెక్ చేతికిచ్చింది. ఇక ఆ ఎంప్లాయ్ ఫీలింగ్ చూడాలి. ఎగిరి గంతేసినంత పని చేశాడు. ఏ కంపెనీ అన్న వివరాలు తెలియకపోయినా...చైనాలోని షెన్‌జెన్‌లో జరిగిన పార్టీలో ఉద్యోగికి ఈ చెక్ అందించినట్టు చైనా మీడియా వెల్లడించింది. ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చైర్‌లో కూర్చుని ఉన్నాడు. అతడి చేతిలో భారీ చెక్ కనిపిస్తోంది. 365 Days of Paid Leaves అని ఆ చెక్‌పై చైనీస్‌లో రాసి ఉంది.
男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO
— The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023
సోషల్ మీడియాలో వైరల్..
Straits Times ఈ వార్తను రిపోర్ట్ చేసింది. అయితే...విన్నర్ మాత్రం ఇది నిజమా కాదా అన్న క్లారిటీ ఇవ్వలేదు. కొందరు మాత్రం ఇది నిజమే అని తేల్చి చెబుతున్నారు. అంతే కాదు. ఈ ప్రైజ్ అందుకోగానే ఆ ఉద్యోగి స్టన్ అయిపోయాడట. కంపెనీ డిన్నర్ పార్టీ దాదాపు మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తోందట. కరోనా కారణంగా క్యాన్సిల్ అవుతూ వచ్చింది. ఈ సమయంలోనే లక్కీ డ్రా నిర్వహించింది కంపెనీ. ఇందులోనే అనుకోకుండా ఓ ఉద్యోగికి ఈ ఆఫర్ వచ్చింది. మరి ఈ ఆఫర్‌ను ఆ ఎంప్లాయ్ ఉపయోగించుకుంటాడా..? లేదంటే పెయిడ్ లీవ్స్‌ని ఎన్‌క్యాష్ చేసుకుంటాడా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్‌కు తెర తీసింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. "లక్కీ ఛాన్స్" అని కొందరు అంటుంటే...ఈ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉందా..ఓ సంవత్సరం తరవాత నీ ప్లేస్‌లో వేరే వాళ్లు వస్తారు అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఆ ఉద్యోగి మాత్రం "ఇంత కన్నా అదృష్టం ఏముంటుంది" అనుకుంటున్నాడు. మనకీ ఇలాంటి లక్కీ డ్రాలు పెట్టరెందుకు అని కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: US Man Surgery: డేటింగ్‌కు అడ్డొచ్చిన హైట్, 5 ఇంచులు పెరిగేందుకు కోటిన్నర సమర్పించాడు