By: Ram Manohar | Updated at : 15 Apr 2023 12:12 PM (IST)
డేటింగ్‌కు ఇబ్బంది అవుతోందని అమెరికాలోని ఓ వ్యక్తి సర్జరీ చేయించుకుని హైట్ పెరిగాడు. (Image Credits: Twitter)
US Man Leg-Lengthening Surgery:
ఎత్తు పెరిగేందుకు సర్జరీ
హైట్ తక్కువగా ఉన్న వాళ్లలో కొందరు ఇన్‌ఫీరియర్‌గా ఫీల్ అవుతుంటారు. ఎత్తు పెంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తారు. కాస్త క్యాష్ పార్టీ అయితే లక్షల రూపాయలు పోసి హైట్ పెరిగేందుకు ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. అమెరికాలోని ఓ 41 ఏళ్ల వ్యక్తి ఇదే చేశాడు. 5 ఇంచుల ఎత్తు పెరిగేందుకు ఆయన చేసిన ఖర్చెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందుకోసం రూ.1.35 కోట్లు ఖర్చు చేశాడు. రెండు కాళ్లకూ సర్జరీ చేసి తన ఎత్తుని 5 ఇంచులు పెంచుకున్నాడు. ఆ వ్యక్తి పేరు మోసెస్ గిబ్సన్. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇంత ఖర్చు పెట్టి హైట్ పెరిగింది ఎందుకో తెలుసా..? డేటింగ్ కోసం. నిజానికి గిబ్సన్ హైట్ 5.5 అడుగులు. కానీ తన హైట్‌తో డేటింగ్ చేయడం కష్టమైందట. ఎత్తుగా లేడని చాలా మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారట. అందుకే మనోడు ఎలాగైనా ఎత్తు పెరగాల్సిందే అని మొండి పట్టు పట్టాడు. ఎన్నో రకాల మెడికేషన్ ట్రై చేశాడు. కొంత మంది బాబాలనూ కలిశాడు. ఏదీ వర్కౌట్ కాలేదు. చివరకు సర్జరీ బెటర్ అని తెలుసుకున్నాడు. వెంటనే దాదాపు కోటిన్నర ఖర్చు చేసి 5 ఇంచులు పెరిగాడు. గతాన్ని తలుచుకుంటేనే భయమేసేదని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానని చెబుతున్నాడు గిబ్సన్.
"ఒకప్పుడు నన్ను నేను చూసుకోడానికి కూడా ఇబ్బందిగా అనిపించేది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయాను. ముఖ్యంగా అమ్మాయిలతో డేటింగ్ చేయలేకపోయాను. నా డేటింగ్ లైఫ్‌పై చాలా ఎఫెక్ట్ పడింది. అమ్మాయిల ముందు ఎత్తుగా కనిపించాలని షూలో ఎత్తుగా ఉండే వస్తువులు పెట్టుకునే వాడిని. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ముందు ఎన్నో మందులు మింగాను. ఆ తరవాత ఆధ్యాత్మిక గురువులను కలిశాను. వాళ్లు ఏదో మూలికలిచ్చారు. అవి కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అందుకే సర్జరీ చేయించుకున్నా. నొప్పి పెడుతుందని తెలిసినా వేరే ఆప్షన్ లేక ఈ నిర్ణయం తీసుకున్నాను"
- మోసిస్ గిబ్సన్
Moses Gibson spent 170k on 2 height lengthening surgery after being subjected heightism for being 5’5!
— The Cosmetic Lane (@TheCosmeticLane) April 12, 2023
He said he long struggled to get a girlfriend due to his 5-foot-5-inch frame, initially turning to medication and a “spiritual healer” to try to increase his height… He… pic.twitter.com/HqoTcUyCZR
ఈ సర్జరీ పూర్తై 5 ఇంచుల హైట్ పెరగడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గానే కాకుండా ఊబర్ డ్రైవర్‌గానూ పని చేస్తున్నాడు గిబ్సన్. 2016లో ఓ సారి సర్జరీ చేయించుకున్నాడు. అప్పుడు 3 ఇంచులు పెరిగాడు.
"మొదటి సారి సర్జరీ చేసుకున్నప్పుడు నాకు చాలా పాజిటివ్‌గా అనిపించింది. 3 ఇంచుల ఎత్తు పెరిగాక నమ్మకం వచ్చింది. అందుకే రెండోసారి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. ప్రస్తుతానికి కాళ్ల ఎత్తు పెరగడానికి ఓ డివైస్ కూడా వాడుతున్నాను. ఈ సర్జరీ పూర్తయ్యాక నా కష్టాలన్నీ తీరిపోయాయి. ముఖ్యంగా అమ్మాయిలతో మాట్లాడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నాకో గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. షార్ట్స్ వేసుకుంటున్నా. నచ్చినట్టుగా ఫోటోలు దిగుతున్నా. మొత్తానికి నా మైండ్ ఫ్రీ అయింది"
- మోసిస్ గిబ్సన్
Also Read: Kapil Sibal: బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని ఆయనకు ముందే ఎలా తెలుసు - అమిత్‌షాపై కపిల్ సిబాల్ ఫైర్
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్, ఎక్కడో కాదు మన దగ్గరే
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?
AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !