News
News
X

Kill Modi Remark: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు- 24 గంటల్లో కాంగ్రెస్ నేత అరెస్ట్!

Kill Modi Remark: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్ట్ చేశారు.

FOLLOW US: 
Share:

Kill Modi Remark: ప్రధాని నరేంద్ర మోదీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజా పటేరియాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లోని దమొహ్ జిల్లాలోని తన నివాసంలో పన్నా పోలీసులు మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేశారు. "రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రధాని మోదీని చంపండి" అని రాజా పటేరియా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సోమవారం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 

ఏమన్నారంటే 

పన్నా జిల్లాలోని పవాయి పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

" మోదీ ఎన్నికల వ్యవస్థను నాశనం చేస్తారు. కులం, మతం, భాష ఆధారంగా ప్రజల్ని విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఒకవేళ మీరు రాజ్యాంగాన్ని కాపాడాలి అనుకుంటే మోదీని చంపడానికి సిద్ధంగా ఉండండి. చంపడం అంటే ఆయన్ను ఓడించడం.                                       "
-   రాజా పటేరియా, కాంగ్రెస్ నేత        

ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో పటేరియా స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తాను గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి అలా వ్యాఖ్యానించానని, మోదీని చంపమని చెప్పడం తన ఉద్దేశం కాదన్నారు. 

దుమారం

ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్‌పై భాజపా నేతలు విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాఖ్యలను ఖండించారు.

" రాజకీయంగా మోదీతో పోటి పడే సత్తా కాంగ్రెస్‌కు లేదు. అందుకే కాంగ్రెస్ నాయకులు మోదీని చంపడం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. ఆయనపై కేసు నమోదైంది. చట్టప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి.                                       "
-శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం

Also Read: India-China Border Clash: అసలు సరిహద్దులో ఏం జరిగింది? చైనాకు ఇంకా బుద్ధి రాలేదా?

Published at : 13 Dec 2022 04:12 PM (IST) Tags: Congress Leader Kill Modi Remark Raja Pateria Arrested

సంబంధిత కథనాలు

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే

Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే

UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?

UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి