అన్వేషించండి

African Snail In Kerala: కేరళలో నత్తల బెడద.. నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమం

Kerala fights snail menace: నత్తల నిర్మూలనకు కేరళ ప్రభుత్వం 'చాప్టర్ వన్- నత్తలు' అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతోంది.

Kerala fights snail menace: 

కేరళలో 2018 వరదల తర్వాత నత్తలు బాగా పెరిగిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి బాగా వ్యాపించాయి. వీటి నిర్మూలనకు 'చాప్టర్ వన్- నత్తలు' అనే కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం చేపట్టబోతోంది. ఆగష్టు 25 నుంచి 31 వరకు ఇది కొనసాగనుంది.

భారీ ఆఫ్రికన్ నత్తల సాంద్రత పెరగడంతో, కేరళలోని కొట్టాయం జిల్లాలో వాటి సంఖ్యను తగ్గించేందుకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. పీటీఐ నివేదికల ప్రకారం, నత్తలు కూరగాయలు, పండ్లను నాశనం చేస్తాయి. మానవులలో మెనింజైటిస్‌కు కూడా కారణమవుతాయి.

ఆర్థికంగా నష్టం

 'చాప్టర్ వన్- నత్త' కార్యక్రమం ద్వారా నత్తలను పట్టుకుని చంపుతారు. ఈ కార్యక్రమం ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లా అంతటా అమలు చేయనున్నట్టు  కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నత్తల విస్తరణ  వ్యవసాయ పంటలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని.. దీని వలన రైతులు, స్థానికులు ఆర్థికంగా నష్టపోతారని చెప్పారు.  

ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం

మానవులు, జంతువులు, ప్రకృతి , ఇతర జీవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'వన్ హెల్త్' ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. రైతు సంఘాలు, , కుటుంబశ్రీ, హరితకర్మ సేన, పాదశేఖర సమితి తదితర సంఘాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.

నత్తల బెడదపై కేరళ ప్రభుత్వం ఇలా పోరాడబోతోంది

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రకారం.. క్యాబేజీ,  కాలీఫ్లవర్ లేదా బొప్పాయి ఆకులను చిన్న ముక్కలుగా కోసి లేదా చూర్ణం చేసి, తడి గోనె లేక బెడ్‌షీట్‌లో వేసి, నత్తలను ఆకర్షించడానికి వాటిని ఇంటి చుట్టూ పెట్టి ఉచ్చులు సిద్ధం చేస్తారు. అవి చిక్కుకున్న తర్వాత, వాటిని ఉప్పునీటిలో ముంచి చంపి, ఆ తర్వాత సమీపంలోని గుంతల్లో పాతిపెడతారు. ఈ ప్రక్రియ ఒక వారం పాటు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. కొట్టాయం జిల్లాలోని ఉజ్వూర్, పంపాడి బ్లాక్‌లు, మేలుకావు పంచాయతీలు ఈ నత్తల కారణంగా ఎక్కువ నష్టపోతున్నాయని చెప్పారు. 

Also Read: Bilkis Bano Case: సుప్రీం కోర్టు గడప తొక్కిన బిల్కిస్ బానో కేసు, దోషుల విడుదలను సవాలు చేస్తూ పిటిషన్

Also Read: Rashmi Gautam : 'జబర్దస్త్' స్టేజి మీద రష్మీకి అవమానమా!?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget