అన్వేషించండి

Bilkis Bano Case: సుప్రీం కోర్టు గడప తొక్కిన బిల్కిస్ బానో కేసు, దోషుల విడుదలను సవాలు చేస్తూ పిటిషన్

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయటంపై మహిళా కార్యకర్తలు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.

Bilkis Bano Case: 

పిటిషన్ వేసిన మహిళా కార్యకర్తలు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను ఆగస్టు 15వ తేదీన విడుదల చేశారు. దీనిపై ఇంకా రగడన కొనసాగుతూనే ఉంది. ఇది అనుచిత నిర్ణయం అని భాజపాపై అందరూ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అటు బాధితురాలు బిల్కిస్ బానో కూడా ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూడా. 
అయితే..ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టుకు గడప తొక్కింది. 11 మంది దోషుల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ అంశాన్ని విచారించనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. దోషుల విడుదలను రద్దు చేయాలని కోరుతూ..మహిళా హక్కుల కార్యకర్తలు రేవతి లౌల్, సుభాషిణి అలీ, రూపా రేఖా వర్మలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.  సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ, జ‌స్టిస్ సీటీ ర‌వికుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించ‌నుంది. సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబాల్‌, అడ్వ‌కేట్ అప‌ర్ణా భ‌ట్‌లు ఈ కేసు వాదించ‌నున్నారు. 

వాళ్లు సంస్కారవంతులు: భాజపా ఎమ్మెల్యే

ఇప్పటికే  వాళ్లను విడుదల చేయటంపై దుమారం రేగుతుండగా..ఇప్పుడు మరో విషయం ఈ వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది. గుజరాత్ భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. "ఈ కేసులో దోషులైన వారిలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారు. వారెంతో సంస్కార వంతులు. బహుశా వారి ముందు తరం వాళ్లు చేసిన తప్పులకు వీళ్లు శిక్ష అనుభవిస్తున్నారేమో" అని గోద్రా ఎమ్మేల్యే సీకే రౌల్జీ వ్యాఖ్యానించారు. ఆ 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ప్రతిపాదించిన వారిలో ఈ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. "15 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన వీళ్లు అసలు ఆ నేరం చేశారా లేదా అన్నది నాకు తెలియదు. మేం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నాం. 
వాళ్ల ప్రవర్తనను గమనించి, నిర్ణయం తీసుకోవాలని మాకు సుప్రీం కోర్టు సూచించింది" అని రౌల్జీ పీటీఐతో చెప్పారు. వాళ్లను విడుదల చేసే ముందు జైలర్‌తో మాట్లాడమని అన్నారు. ఆ సమయంలోనే వారి సత్ప్రవర్తన గురించి తెలిసిందని వెల్లడించారు. వాళ్లలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, ఎంతో సంస్కారవంతులు అని జైలర్ చెప్పినట్టు రౌల్జీ వివరించారు. "సాధారణంగా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు, 
ఎలాంటి సంబంధం లేని వాళ్ల పేర్లు కూడా తెరపైకి వస్తాయి. బహుశా వీరి ముందు తరం వాళ్లు చేసిన తప్పుల వల్ల వీరిపై అభియోగాలు వచ్చి ఉండొచ్చు. వాళ్లు నేరం చేశారా లేదా అన్నది తెలియదు కానీ..వాళ్ల ప్రవర్తన ఆధారంగానే విడుదల చేశాం" అని రౌల్జీ స్పష్టం చేశారు. 

సామూహిక అత్యాచారం..

గుజరాత్ అల్లర్లు-2002 సమయంలో బిల్కిస్ బానోపై  సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యుల ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్‭లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతురితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించు కున్నారు. ఈ ఘటనపై అప్పట్లో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను 2004లో అరెస్ట్ చేశారు. 2008 జనవరి 1న వీరికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్ష పడిన వారిని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన ఖైదీల కింద విడుదల చేశారు. వీరిని విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం వంటి కేసులున్న వారిని విడుదల చేయకూడదన్న నిబంధనలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: పాదయాత్రలో బండి సంజయ్ అరెస్ట్‌- జనగామలో హైటెన్షన్

Also Read: MLA Raja Singh Arrest : రాజాసింగ్ అరెస్ట్.. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు| ABP Desam

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Embed widget